బంగారం ధరలు తగ్గాలంటే ఆ ఒక్క అద్భుతం జరగాలి
బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది ఒక దేశ ఆర్థిక బలానికి చిహ్నం. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో బంగారం ధరలు తగ్గకపోగా, మరింత పరుగులు తీయడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న 'రుణ భారం' అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ డేవిడ్ టైట్ కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వాలు తమ అప్పులను తీర్చగలవా లేదా అనే భయం ఇన్వెస్టర్లలో పెరగడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి తోడవడంతో అందరూ 'సురక్షిత ఆస్తి' అయిన బంగారం వైపు మళ్లుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు గత మూడేళ్లుగా ఏటా సుమారు 1,000 టన్నుల బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. అయితే, పశ్చిమ దేశాల (అమెరికా, యూరప్) సెంట్రల్ బ్యాంకులతో పోలిస్తే, భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాల నిల్వలు ఇంకా వెనుకబడే ఉన్నాయని టైట్ అభిప్రాయపడ్డారు. ఈ లోటును పూడ్చుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వంటి సెంట్రల్ బ్యాంకులు నిరంతరం కొనుగోళ్లు చేస్తూనే ఉంటాయని, ఇది పసిడి డిమాండ్‌ను స్థిరంగా ఉంచుతుందని ఆయన వివరించారు.

భారత్‌లో ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ జూమ్!
2025లో భారత పసిడి డిమాండ్ గణాంకాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మొత్తం డిమాండ్ 711 టన్నులు కాగా.. ధరలు పెరిగినప్పటికీ, బార్లు, నాణేల రూపంలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వార్షికంగా 17 శాతం పెరిగింది. ధరల పెరుగుదల వల్ల నగల అమ్మకాలు కాస్త తగ్గినప్పటికీ, భారతీయులకు బంగారంతో ఉన్న సాంస్కృతిక అనుబంధం వల్ల దీనికి ఎప్పుడూ స్థిరమైన మద్దతు ఉంటుందని టైట్ పేర్కొన్నారు.
Gold ధరలు తగ్గే ఛాన్స్ ఉందా?
"బంగారం ధరలు తగ్గాలంటే ఒక అద్భుతం జరగాలి" అన్నట్లుగా డేవిడ్ టైట్ మాట్లాడారు. అమెరికా ఆర్థిక వృద్ధి 6-7 శాతానికి పెరిగి, అప్పులు తగ్గి, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తేనే పసిడి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది జరిగే అవకాశం "చాలా తక్కువ" అని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో పెన్షన్ ఫండ్లు, బీమా నిధులు కూడా బంగారం వైపు మళ్లుతాయని, దీనివల్ల సంస్థాగత పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications