దేశంలో భారీగా తగ్గిన బంగారం ధరలు: పండగలు సమీపిస్తోన్న వేళ..
దేశంలో నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, అంతర్జాతీయ కామెక్స్ లల్లో చోటుచేసుకున్న సవరణలు, మార్పులే ఇందుకు ప్రధాన కారణం అయ్యాయి. పండగ సీజన్ సమీపిస్తోన్నప్పటికీ.. కొనుగోలు డిమాండ్ సరిపడా లేకపోవడం కూడా ఈ తగ్గుదలకు దారితీసింది.
డాలర్ ఇండెక్స్‌లో చోటుచేసుకుంటున్న ఒడిదొడుకులు, అంతర్జాతీయ ముడి చమురు ధరల్లో వస్తున్న మార్పులు దేశీయంగా బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయి. వీటన్నింటికీ మించి.. ఈ నెల 29వ తేదీన జరగనున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక విధాన నిర్ణయాల కోసం అంతర్జాతీయ మార్కెట్ వర్గాలన్నీ కూడా ఎదురుచూస్తున్నాయి. వీటి ఫలితాల మీద బంగారం, వెండి ధరలు ఆధారపడి ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడం, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో రేట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటోన్నాయి. కామెక్స్‌లో స్పాట్ బంగారం ధర 0.16 శాతం పడిపోయి 4,043.60 డాలర్ల వద్దకు చేరింది. వెండి కూడా 0.46 శాతం క్షీణించి 57.78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీని ప్రభావం భారత్ లో బంగారం ధరలపై పడింది. గురువారం నాటి క్లోజింగ్ సెషన్‌తో పోల్చుకుంటే ధరల్లో తగ్గుదల కనిపించింది.
దేశీయంగా ఎంసీఎక్స్‌లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 1.98 శాతం తగ్గి రూ.1,42,796 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,850 రూపాయల వరకు తగ్గింది. 22 క్యారెట్లల్లో 1,700, 18 క్యారెట్ల పసిడిలో 1,390 రూపాయల మేర క్షీణతన నమోదు చేసుకున్నాయి. అటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ధర 3.41 శాతం క్షీణించింది. కిలో 2,19,250 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,433, 22 క్యారెట్లు - రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 11,045
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,433, 22 క్యారెట్లు- రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 10,825














Click it and Unblock the Notifications