భారీగా పుంజుకొంటోన్న బంగారం రేట్లు: ఇకపై ఇదే ట్రెండ్..?
పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలు కాస్త పుంజుకుంటోన్నాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధరలు చెప్పుకోదగ్గస్థాయిలో పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,800 వద్ద స్థిరపడింది. అంతకుముందు సెషన్‌లో ఈ ధర రూ.1,49,300 గా నమోదైంది. గత రెండు సెషన్లలో బంగారం ధర దాదాపు రెండు శాతం మేర అంటే రూ. 2,800 వరకు క్షీణించిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది.
దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,50,280 రూపాయలుగా నమోదైంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి విస్తృతంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఈ ధర 1,37,750 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 1,12,710 రూపాయల వద్ద కొనసాగుతోంది. బుధివారం నాటి ధరలతో పోలిస్తే నేడు పసిడి రేట్లు గణనీయంగా పెరిగాయి. ఇకపై ఇదే ట్రెండ్ కొనసాగవచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,280, 22 క్యారెట్లు రూ. 1,37,750 వద్ద నిలిచింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,280, 22 క్యారెట్లు 1,37,750, ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,280, 22 క్యారెట్లు రూ. 1,37,750 గా రికార్డయ్యాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,280 పలకగా.. 22 క్యారెట్లు రూ. 1,37,750 వద్ద ట్రేడ్ అయింది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,028, 22 క్యారెట్లు - రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,317
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,271
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,271
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,271
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,028, 22 క్యారెట్లు- రూ. 13,775, 18 క్యారెట్లు - రూ. 11,271
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,957, 22 క్యారెట్లు- రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,218












Click it and Unblock the Notifications
