పాతాళానికి పసిడి రేట్లు- మరో భారీ పతనం
దేశంలో పసిడి ధరల పతనానికి బ్రేకులు పడట్లేదు. మరోసారి బంగారం ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. నేడు దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. సుమారు వారం రోజుల పాటు ఏకధాటిగా పెరుగుతూ వచ్చిన వీటి రేట్లు భారీగా తగ్గుతోండటం సాధారణ కొనుగోలుదారులకు భారీ ఉపశమనాన్ని ఇచ్చినట్టయింది. అదే సమయంలో లాభాల కోసం ముందుగానే కొని పెట్టుకున్న వారికి మాత్రం షాక్ ఇచ్చింది.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేడు బంగారం ధరల తగ్గుదల స్పష్టంగా కనిపించింది. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలో 2,890 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్లల్లో రూ. 2,650, 18 క్యారెట్లల్లో రూ. 2,170 మేర పడిపోయాయి. మొన్నటివరకు 1.65 లక్ష రూపాయల వరకూ వెళ్లిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు రూ. 1.58 లక్షలకు దిగొచ్చింది. వెండి ధరలో కూడా ఇదే పరిణామం చోటు చేసుకుంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,58,240 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్లు రూ. 1,45,050గా రికార్డయింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,58,240 కాగా 22 క్యారెట్లు రూ. 1,45,050 వద్ద నిలిచింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,58,240 పలకగా.. 22 క్యారెట్లు రూ. 1,45,050 వద్ద స్థిరపడింది. చెన్నైలో 24 క్యారెట్లు రూ. 1,58,240, 22 క్యారెట్లు రూ. 1,45,050 వద్ద ట్రేడ్ అయింది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,824, 22 క్యారెట్లు - రూ. 14,505, 18 క్యారెట్లు - రూ. 12,275
ముంబై..
24 క్యారెట్లు- రూ. 15,824, 22 క్యారెట్లు - రూ. 14,505, 18 క్యారెట్లు - రూ. 11,868
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 15,824, 22 క్యారెట్లు - రూ. 14,505, 18 క్యారెట్లు - రూ. 11,868
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 15,824, 22 క్యారెట్లు - రూ. 14,505, 18 క్యారెట్లు - రూ. 11,868
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 15,824, 22 క్యారెట్లు - రూ. 14,505, 18 క్యారెట్లు - రూ. 11,868
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 15,824, 22 క్యారెట్లు - రూ. 14,505, 18 క్యారెట్లు - రూ. 11,868

Click it and Unblock the Notifications