బేజారెత్తిస్తోన్న బంగారం ధరలు.. షార్ప్ రైజింగ్: షాక్ కొట్టేలా
దేశీయంగా నేడు పసిడి, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వీటి రేట్లు పెరిగాయి. పైపైకి పరుగులు పెడుతున్నాయి. కిందటి నెలలో భారీగా తగ్గిన పసిడి ధరలు ఈ నెల ఆరంభం నుంచే ఉరకలు వేస్తోన్నాయి. లాభాలబాట పడుతున్నాయి. కొత్తగా కొనాలనుకునే వారికి మాత్రం బేజారెత్తిస్తోన్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువలో సంభవిస్తోన్న పరిణామాల నేపథ్యంలో కొద్ది రోజులుగా పసిడి రేట్లల్లో కొనసాగిన ఒడిదుడుకులు ఇప్పుడు కొంతమేర తగ్గాయి.
ఈ ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,48,280 వద్ద నమోదైంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,257 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం నాటితో క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే నేడు 24 క్యారెట్ల రేటులో రూ. 160, 22 క్యారెట్లల్లో రూ. 150, 18 క్యారెట్లల్లో రూ. 120 మేర పెరుగుదల కనిపించింది. గురువారంతో కలుపుకొని చూస్తే ఈ రెండు రోజుల్లో ఏకంగా 2,500 రూపాయలకు పైగా పెరుగుదల నమోదైంది.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,980, 22 క్యారెట్లు రూ. 1,37,740 వద్ద ట్రేడ్ అవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి రూ. 1,50,040 కాగా 22 క్యారెట్లు రూ. 1,37,550 కు చేరుకుంది. బెంగళూరులో వీటి ధరలు వరుసగా 24 క్యారెట్లకు రూ. 1,49,890, 22 క్యారెట్లకు రూ. 1,37,040 వద్ద స్థిరపడ్డాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,890 కాగా 22 క్యారెట్లు రూ. 1,37,040 వద్ద నిలిచింది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,000, 22 క్యారెట్లు - రూ. 13,750, 18 క్యారెట్లు - రూ. 11,565
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,989, 22 క్యారెట్లు- రూ. 13,740, 18 క్యారెట్లు - రూ. 11,242
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,989, 22 క్యారెట్లు- రూ. 13,740, 18 క్యారెట్లు - రూ. 11,242
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,989, 22 క్యారెట్లు- రూ. 13,740, 18 క్యారెట్లు - రూ. 11,242
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,989, 22 క్యారెట్లు- రూ. 13,740, 18 క్యారెట్లు - రూ. 11,242
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,989, 22 క్యారెట్లు- రూ. 13,740, 18 క్యారెట్లు - రూ. 11,242

Click it and Unblock the Notifications