బంగారం ధరలో పురోగమనం- దీపావళి నాటికి.. !!
దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు మళ్లీ క్రమంగా పుంజుకుంటోన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, అమెరికన్ డాలర్ మారకపు విలువ, సెంట్రల్ బ్యాంకుల విధానాలు బంగారం ధరల కదలికలను ప్రభావితం చేస్తోన్నాయి. పండగ సీజన్ కూడా దీనికి తోడు కావడంతో ధరల్లో పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. వరుసగా రెండో రోజు కూడా పెరుగుదల బాటపట్టింది. ఇది స్వల్పమే అయినప్పటికీ.. ఇక మున్ముందు ఇదే ధోరణి కొనసాగుతుందనే అంచనాలకు తెర తీసింది.
దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో సోమవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ. 540 మేర పెరుగుదల నమోదైంది. 22 క్యారెట్లల్లో రూ. 500, 18 క్యారెట్లల్లో రూ. 480 పెరిగాయి. మొత్తంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,290 వద్దకు చేరింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,350 కి పెరిగింది. 18 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర 1,07,570 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,290 వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,31,350 వద్ద స్థిరపడింది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,43,290 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. 1,31,350 ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,44,100, రూ. 1,32,320 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,43,290, 22 క్యారెట్లు రూ. 1,32,350 వద్ద కొనసాగుతున్నాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,329, 22 క్యారెట్లు - రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,750
ముంబై..
24 క్యారెట్లు- రూ. 14,329, 22 క్యారెట్లు - రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,757
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 14,329, 22 క్యారెట్లు - రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,757
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 14,329, 22 క్యారెట్లు - రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,757
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 14,329, 22 క్యారెట్లు - రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,757
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 14,329, 22 క్యారెట్లు - రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,757












Click it and Unblock the Notifications
