కుప్ప కూలుతున్న బంగారం ధరలు: ఒక్క పూటలో .. !!
బంగారం ధరల్లో నేడు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రికార్డు స్థాయి రేటుకు చేరుకున్న పసిడి.. ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బంగారం కొనుగోలుదారుల్లో ఆశలను రేకెత్తిస్తోంది. ఇప్పుడిప్పుడే ఆరంభమైన వీటి ధరల క్షీణత.. ఇక మున్ముందు కూడా కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అంతర్జాతీయ చోటు చేసుకుంటోన్న పరిణామాలు కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోన్నాయి.
ఉదయం 10 గంటల సమయానికి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల పసిడి రూ. 1,48,801ల వద్ద ట్రేడ్ అయింది. బుధవారం నాటితో పోల్చుకుంటే ఒక్కపూటలో 6,000 రూపాయల వరకు తగ్గుదల కనిపించింది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభం నుంచే వీటి రేట్లు పడిపోవడం కనిపించింది. 1,53,784 రూపాయల వద్ద ఆరంభమైన ట్రేడింగ్.. కుప్పకూలుతూ వచ్చింది. ఒక దశలో గరిష్ఠంగా 1,48,777 రూపాయల వరకు క్షీణించింది. ఆ తరువాత కొద్దిగా కోలుకుందే తప్ప ఏదశలోనూ భారీగా పెరగలేదు.

వెండి ధలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో వెండి ధర 1.45 శాతం పడిపోయి, ఔన్సుకు 93.45 డాలర్లకు చేరింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,51,610 కాగా, 22-క్యారెట్లు ₹1,41,560. ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, పూణే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాల్లో కొంత హెచ్చు తగ్గులతో దాదాపుగా ఇవే రేట్లు నమోదయ్యాయి.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,491, 22 క్యారెట్లు - రూ. 14,200, 18 క్యారెట్లు - రూ. 11,850
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,431, 22 క్యారెట్లు- రూ. 14,145, 18 క్యారెట్లు - రూ. 11,573
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,431, 22 క్యారెట్లు- రూ. 14,145, 18 క్యారెట్లు- రూ. 11,573
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,431, 22 క్యారెట్లు- రూ. 14,145, 18 క్యారెట్లు- రూ. 11,573
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,431, 22 క్యారెట్లు- రూ. 14,145, 18 క్యారెట్లు- రూ. 11,573
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,431, 22 క్యారెట్లు- రూ. 14,145, 18 క్యారెట్లు- రూ. 11,573
-
పడి లేచిన బంగారం ధరలు- అంచనాలు తలకిందులు చేస్తూ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications