పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ
బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం నాడు భారీగా పెరిగిన పసిడి రేట్లు నేడు తగ్గుముఖం పట్టాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం, మధ్యప్రాచ్య సంఘర్షణ, ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై యుద్ధ ప్రభావం నేపథ్యంలో పెట్టుబడిదారుల అంచనాలు తలకిందులవుతున్నాయి. ఈ అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరల స్థిరత్వాన్ని దెబ్బతీస్తోన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల కోత ప్రశ్నార్థకంగా మారడం దీనికి తోడైంది.
నేడు పసిడి రేట్లు మళ్లీ తగ్గుదల బాట పట్టాయి. రంజాన్ పండగ వేళ.. భారీగా తగ్గాయి. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,50,070 కాగా, 22 క్యారెట్లు రూ. 1,37,140గా నమోదైంది. కిందటి ముగింపు సెషన్ తో పోల్చుకుంటే వీటి రేట్లల్లో భారీ తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఔన్స్ బంగారం 4,574.34 డాలర్లకు దిగింది. అంతకుముందు సెషన్ కంటే 2.51 శాతం తగ్గింది. వెండి 3.82 శాతం వృద్ధితో ఔన్స్‌కు 73.96 డాలర్లకు చేరుకుంది.

మార్చి 20న దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు కొద్దిగా మారాయి. ఢిల్లీ, జైపూర్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,50,420, 22 క్యారెట్లు రూ. 1,37,890కి లభించగా, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,50,270, 22 క్యారెట్లు రూ. 1,37,740 వద్ద ట్రేడ్ అయ్యింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,219, 22 క్యారెట్లు - రూ. 13,951, 18 క్యారెట్లు - రూ. 11,641
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,890, 22 క్యారెట్లు- రూ. 13,654, 18 క్యారెట్లు - రూ. 11,172
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,890, 22 క్యారెట్లు- రూ. 13,654, 18 క్యారెట్లు - రూ. 11,172
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,890, 22 క్యారెట్లు- రూ. 13,654, 18 క్యారెట్లు - రూ. 11,172
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,890, 22 క్యారెట్లు- రూ. 13,654, 18 క్యారెట్లు - రూ. 11,172
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,890, 22 క్యారెట్లు- రూ. 13,654, 18 క్యారెట్లు - రూ. 11,172

Click it and Unblock the Notifications