పట్టిందల్లా బంగారమే- రేపటి నుంచి.. !!
ఈ వారం బంగారం, వెండి ధరలు, పెట్టుబడి, కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోన్నాయి. రికార్డు స్థాయిల వద్ద నెలల తరబడి కొనసాగిన బంగారం ధరలు ఇటీవలి గరిష్ఠాల నుంచి దాదాపు 13 నుంచి 15 శాతం తగ్గాయి. అమెరికా వడ్డీ రేట్లు, బలమైన డాలర్, అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లు ఈ సవరణకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ముందున్న నేపథ్యంలో ఈ తగ్గుదల ఆభరణాల కొనుగోళ్లకు ఊతమివ్వవచ్చు.
దీర్ఘకాలిక పెట్టుబడిదారులు కూడా ఇటీవలి గరిష్ఠాల కంటే తక్కువ స్థాయిల్లో బంగారం కూడబెట్టే అవకాశంగా దీన్ని చూస్తున్నారు. నేడు భారత్ లో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 14,804, 22 క్యారెట్లు రూ. 13,559 వద్ద ఉంది. ఫిజికల్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 150,900 కాగా, 22 క్యారెట్లు రూ. 138,325గా నమోదైంది. ప్రధాన మెట్రోల్లో చెన్నైలో ధరలు అత్యధికంగా ఉన్నాయి.

MCXలో ఆగస్టు నాటి గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రూ. 1,50,675 10 గ్రాముల వద్ద ట్రేడవుతోంది. గత ముగింపు ధర రూ. 1,48,932తో పోలిస్తే రూ. 1,743 పెరుగుదల నమోదైంది. సెషన్‌లో కనిష్ఠం రూ. 1,49,498, గరిష్ఠం రూ. 1,51,053గా రికార్డయింది. ఈ కాంట్రాక్ట్ గడువు ఆగస్టు 5తో ముగుస్తుంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరనున్నందున వచ్చే వారంలో బంగారం ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి దీన్ని మంచి సమయంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి.
ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్ లో 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,03,100, 22 క్యారెట్లు రూ. 1,36,700, 24 క్యారెట్లు 1,49,130 పలుకుతోంది. బెంగళూరులో 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,11,810, 22 క్యారెట్లు రూ. 1,36,650, 24 క్యారెట్లు 1,49,080, చెన్నైలో 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,16,100, 22 క్యారెట్లు రూ. 1,38,600, 24 క్యారెట్లు 1,51,200, హైదరాబాద్ లో 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,11,810, 22 క్యారెట్లు రూ. 1,36,650, 24 క్యారెట్లు 1,49,080 గా నమోదైంది.
999 స్వచ్ఛత కలిగిన ఫైన్ సిల్వర్ జాతీయ బెంచ్‌మార్క్ ధర కిలోకు రూ. 2,46,604గా ఉంది. అదే సమయంలో 999 స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,47,800గా నమోదైంది. కిలో వెండి అహ్మదాబాద్ లో రూ. 2,46,600, బెంగళూరులో రూ. 2,46,500, చెన్నైలో రూ. 2,47,900, ఢిల్లీలో రూ. 2,46,750, హైదరాబాద్ లో రూ. 2,47,570, కోల్ కతలో రూ. 2,46,850, ముంబైలో రూ. 2,47,180 వద్ద స్థిరపడింది.












Click it and Unblock the Notifications