వామ్మో.. పట్టపగ్గాల్లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు- ఒకేసారి
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. దాదాపుగా అయిదు రోజుల పాటు మార్కెట్ ను షేక్ చేసిన అనంతరం పైపైకి ఎగబాకడం మొదలు పెట్టాయి. నేడు బంగారం, వెండి ధరల రేట్లు రెండు శాతానికి పైగా పెరిగాయి. ఈ రెండింటి ధరలు పెరగడం వరుసగా ఇది రెండో రోజు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో భారత్ పై విధించిన టారిఫ్ ను 18 శాతం మేర తగ్గించడమే దీనికి ప్రధాన కారణం. అటు డాలర్ బలపడటంతో బుధవారం బంగారం, వెండి ధరలు గణనీయమైన ర్యాలీని కొనసాగించాయి.
పసిడి రెండు శాతానికి పైగా లాభపడింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,000 రూపాయలను అధిగమించింది. పెట్టుబడిదారుల్లో ఆశలను మొలకెత్తించింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్ లో స్పాట్ గోల్డ్ 2.2 శాతం వృద్ధితో ఔన్స్‌కు 5,044.74 డాలర్లకు చేరింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్ 2.7 శాతం పెరిగి ఔన్స్‌కు 5,067 డాలర్లకు చేరుకున్నాయి. గత గురువారం పసిడి ధర ఔన్స్‌కు 5,594.82తో రికార్డు స్థాయిని తాకిన విషయం తెలిసిందే. స్పాట్ వెండి ధర కూడా 2.1 శాతం పెరిగి ఔన్స్‌కు 86.92 డాలర్లకు చేరింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,256, 22 క్యారెట్లు - రూ. 14,900, 18 క్యారెట్లు - రూ. 12,750
ముంబై..
24 క్యారెట్లు - రూ. 16,053, 22 క్యారెట్లు- రూ. 14,715, 18 క్యారెట్లు - రూ. 12,040
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,053, 22 క్యారెట్లు- రూ. 14,715, 18 క్యారెట్లు- రూ. 12,040
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,153, 22 క్యారెట్లు- రూ. 13,890, 18 క్యారెట్లు- రూ. 11,365
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,053, 22 క్యారెట్లు- రూ. 14,715, 18 క్యారెట్లు- రూ. 12,040
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,053, 22 క్యారెట్లు- రూ. 14,715, 18 క్యారెట్లు- రూ. 12,040












Click it and Unblock the Notifications