సడన్ గా పసిడి ధరల్లో అనూహ్య పరిణామం

దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. డాలర్ బలహీన పడటం, అమెరికా-ఇరాన్ మధ్య నిలిచిపోయిన శాంతి చర్చల్లో పురోగతి నెలకొనడం వంటివి దీనికి ప్రధాన కారణాలు అయ్యాయి. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,54,030 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,41,190 రూపాయలు పలుకుతోంది. వెండి ధరల్లో స్థిరత్వం కనిపించింది. కిలో వెండి ధర 2,59,800 వద్ద స్థిరపడింది.

దేశంలో బంగారం ధరలు పుంజుకోవడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. భారత్ తో పాటు అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ధరలో భారీ కదలిక చోటు చేసుకుంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,707.75 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగింది, అంతకుముందు సెషన్‌లో 0.8 శాతం క్షీణించినప్పటికీ, ఇప్పుడు పెరుగుదల చోటుచేసుకుందిందులో. గత వారంలో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 2.5 శాతం పడిపోయి, నాలుగు వారాల లాభాల పరంపరకు అడ్డుకట్ట వేసింది. జూన్ డెలివరీకి సంబంధించిన అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం తగ్గి 4,720.50 డాలర్లకు చేరుకుంది.

Gold Rates in India Rise as Global Dollar Softens 24K Hits Rs 154030 22K at Rs 141190 per 10gram

ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,41,340 రూపాయలు, 24 క్యారెట్ల 1,54,180 రూపాయలుగా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,41,240, 24 క్యారెట్ల బంగారం రూ. 1,54,080 పలుకుతోంది. పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,41,190కి, 24 క్యారెట్లు రూ. 1,54,030కి లభించింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,524, 22 క్యారెట్లు - రూ. 14,230, 18 క్యారెట్లు - రూ. 11,870

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు - రూ. 11,582

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు - రూ. 11,582

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు - రూ. 11,582

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు - రూ. 11,582

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు - రూ. 11,582

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+