పసిడి ధరల పతనానికి ఎట్టకేలకు బ్రేక్.. !!

బంగారం, వెండి ధరల పతనానికి ఎట్టకేలకు బ్రేక్ పడింది. దేశీయంగా నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావం వీటిపై స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లను పెంచవచ్చనే ప్రచారాలు, ద్రవ్యోల్బణ భయాలు పసిడి ధరల గమనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుదల బాట పట్టాయి.

ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్ కామెక్స్ లో స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 3,882.09 డాలర్ల వద్ద నమోదైంది. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 270 రూపాయల మేర పెరిగింది. 22 క్యారెట్లు రూ. 250, 18 క్యారెట్లు రూ. 210 వరకు పెరిగాయి. ఇది నామమాత్రమే అయినప్పటికీ.. వారం రోజులుగా కొనసాగుతూ వస్తోన్న ధరల పతనానికి బ్రేక్ వేసినట్టయింది.

Gold rates in India surged across 24K 22K and 18K despite concerns around rate hike in Fed policy

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,280 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,25,840 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,37,060 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,25,638 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,37,460, రూ.1,26,005 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,1,37,170, 22 క్యారెట్లు రూ. 1,25,739 వద్ద కొనసాగుతున్నాయి.

పిల్లల విద్యపై పెట్టే పెట్టుబడులే నవభారత నిర్మాణానికి పునాది- జగన్
పిల్లల విద్యపై పెట్టే పెట్టుబడులే నవభారత నిర్మాణానికి పునాది- జగన్

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి..

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,762, 22 క్యారెట్లు - రూ. 12,615, 18 క్యారెట్లు - రూ. 10,330

ముంబై..

24 క్యారెట్లు- రూ. 13,762, 22 క్యారెట్లు - రూ. 12,615, 18 క్యారెట్లు - రూ. 10,322

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 13,762, 22 క్యారెట్లు - రూ. 12,615, 18 క్యారెట్లు - రూ. 10,322

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 13,762, 22 క్యారెట్లు - రూ. 12,615, 18 క్యారెట్లు - రూ. 10,322

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 13,762, 22 క్యారెట్లు - రూ. 12,615, 18 క్యారెట్లు - రూ. 10,322

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 13,762, 22 క్యారెట్లు - రూ. 12,615, 18 క్యారెట్లు - రూ. 10,322

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+