పండగ పూట శాంతించిన బంగారం.. 10 గ్రాముల ధర ఎంతంటే...?

భారతీయ మార్కెట్‌లో కొద్ది రోజుల నుంచి బంగారం , వెండి ధరలు ఊహించని విధంగా పరుగులు పెట్టాయి. సామాన్య పెట్టుబడిదారులను, ఆభరణాల ప్రియులను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ.. 10 గ్రాముల పసిడి ధర ఏకంగా లక్షా 30 వేల మార్కును దాటి చరిత్ర సృష్టించింది. వెండి కూడా అదే స్థాయిలో దూసుకుపోయింది. కిలో వెండి ధర దాదాపు 2 లక్షల రూపాయల సమీపానికి చేరడం గమనార్హం.ఈ ధరల ఉధృతి నేపథ్యంలో, దీపావళి పండుగకు ముందు వచ్చిన దంతేరస్ రోజున మాత్రం మార్కెట్ కాస్త ఉపశమనం ఇచ్చింది. ఆ రోజున ఈ విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. అయితే, పండుగ నాడు ఈ తగ్గుదల స్వల్పంగా మాత్రమే కనిపించింది. పది గ్రాముల బంగారంపై కేవలం రూ.10 మేర, కిలో వెండిపై రూ.200 మేర ధర తగ్గింది.

సోమవారం నాటి ధరలు
సోమవారం (అక్టోబర్ 20, 2025) నాటికి దేశీయంగా బంగారం, వెండి రేట్లు అత్యంత గరిష్ఠ స్థాయిలో స్థిరపడినట్లు పలు వెబ్‌సైట్‌ల సమాచారం స్పష్టం చేసింది.

24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రికార్డు స్థాయిలో రూ.1,30,850 గా ఉంది.

22 క్యారెట్ల బంగారం: ఆభరణాల తయారీకి ఉపయోగించే 10 గ్రాముల ధర రూ.1,19,940 వద్ద కొనసాగుతోంది.

వెండి: కిలో వెండి ధర రూ.1,71,900 లుగా నమోదైంది.

Gold Rates in October 20th 2025

తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ధోరణి
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో వెండి ధరలు మాత్రం దేశీయ సగటు ధరల కంటే కొద్దిగా ఎక్కువగా ఉండటం గమనార్హం.

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,850 వద్ద, 22 క్యారెట్ల ధర రూ.1,19,940 వద్ద స్థిరంగా ఉన్నాయి. అయితే, ఈ మూడు నగరాల్లో కిలో వెండి ధర జాతీయ సగటు కంటే అధికంగా రూ.1,89,900 లుగా నమోదైంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,000 మార్కును తాకగా, ముంబైలో రూ.1,30,850 వద్ద ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,30,900 వద్ద కొనసాగుతోంది. వెండి ధర విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాలు మినహా ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.1,71,900 గా ఉంది. చెన్నైలో మాత్రం తెలుగు రాష్ట్రాల మాదిరిగానే రూ.1,89,900 లుగా నమోదైంది.

గమనిక: బంగారం ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండకపోవడానికి ప్రధాన కారణం స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తయారీ ఛార్జీలు, ఇతర అంశాలు. రికార్డు స్థాయిలో ఉన్న ప్రస్తుత ధరలు, అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. భారీ పెరుగుదల తర్వాత స్వల్పంగా తగ్గిన ధరలు, పండుగ సీజన్‌లో కొనుగోళ్లు పెరగడానికి దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+