బంగారం ఇంత లాభం తీసుకొస్తుందని అసలు ఊహించలేదు
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ వార్త నిజంగానే షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో, బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఫలితంగా, పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. రూపాయి విలువ క్షీణించడం కూడా ఈ పెరుగుదలకు మరో ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజు (సెప్టెంబర్ 13న) ఉదయం 6:30 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,11,290కి చేరింది. అదే విధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,010 వద్ద ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబైలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,11,290గా నమోదైంది. ఢిల్లీలో మాత్రం ఈ ధర రూ. 1,11,440కి చేరుకుంది.

వెండి ధరలు కూడా పెరిగాయి
బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కేజీ వెండి ధర రూ. 100 మేర పెరిగింది. ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో కేజీ వెండి ధర రూ. 1,42,100గా ఉంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో వెండి ధర రూ. 1,32,100 వద్ద ఉంది. బంగారంపై పెట్టుబడి పెట్టినవారికి మాత్రం ఊహించని విధంగా లాభాలు దక్కుతున్నాయి.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఆయా నగరాల్లోని తాజా ధరలను ధృవీకరించుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications