మరోసారి తగ్గిన బంగారం ధరలు.. శుక్రవారం గ్రాము ధర ఎంతంటే..?

బంగారం... భారతీయులకు కేవలం ఆభరణం కాదు, తరతరాల భరోసా. అందుకే ధరలు ఆకాశాన్ని అంటుతున్నా, దాని పట్ల ఉన్న మమకారం, నమ్మకం మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో, చాలా మంది పేద, మధ్యతరగతి మరియు వేతన జీవులు పాత బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడానికి జ్యువెలరీ దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. ఇంత భారీ ధర ఉన్నప్పుడు అమ్మి, ఆ డబ్బును బ్యాంకులో దాచుకుంటే వడ్డీ రూపంలోనైనా లాభం పొందవచ్చు అనేది వారి ఆలోచన.

అయితే, చాలా మంది ఆర్థిక నిపుణుల సూచన మరోలా ఉంది. బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని, ప్రస్తుతానికి విక్రయించకుండా దాచుకుంటే భవిష్యత్తులో అది మరింత అధిక లాభాన్ని తెచ్చిపెడుతుందని వారు చెబుతున్నారు. ఒకవేళ ఇప్పుడే విక్రయిస్తే, పెరిగే ధరల కారణంగా ఈ వర్గాలు తిరిగి బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చునని హెచ్చరిస్తున్నారు.

Gold Rates in september 26th 2025

నేడు భారీగా తగ్గిన ధర: మార్కెట్ అప్‌డేట్
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయనే ధోరణి మధ్య, కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభించింది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి, అదే సమయంలో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 930 రూపాయలు తగ్గింది.

ఈరోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నమోదైన ధరల ప్రకారం:

పది గ్రాముల బంగారం ధరపై రూ. 930 తగ్గింది.

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర: రూ. 1,04,890

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర: రూ. 1,14,430

కిలో వెండి ధర: రూ. 1,49,900
బంగారం, వెండి ధరల్లో మార్పులు, కొనుగోలు ధోరణులు మధ్యాహ్నానికి, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మళ్లీ మారే అవకాశం ఉంది. బంగారంపై పెట్టుబడి పెట్టేవారు లేదా కొనుగోలు చేయాలనుకునేవారు ఈ తాజా మార్కెట్ హెచ్చుతగ్గులను పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+