బంగారం ధరలపై అంచనాలన్నీ తలకిందులు- టాప్ గేర్.. !!

దేశంలో బంగారం ధరలు బౌన్స్ బ్యాక్ అయ్యాయి. మరోసారి పెరిగాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా భావించే బంగారంపై ప్రస్తుతం కొనుగోలుదారుల ఆసక్తి పెరగడం వల్ల మార్కెట్ లో ఈ సానుకూల ధోరణి కనిపిస్తోంది. పండగలు, వివాహాల సీజన్ సమీపిస్తుండటంతో ఈ ధరల పెరుగుదల మధ్యతరగతి వినియోగదారులపై అదనపు భారాన్ని మోపనుంది.

నేడు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 760 రూపాయల మేర పెరిగి, 1,43,290 రూపాయలకు చేరింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 700 రూపాయలు పెరిగి రూ. 1,31,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల పసిడి ధరలో 570 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల ధర 1,07,470 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో ధరలు మిగిలిన ప్రాంతాల కంటే స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,43,440 గా నమోదైంది.

Gold Rates showed Upstick trends at MCX futures rising find the latest 24k 22k and 18k Prices Today

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,290, 22 క్యారెట్లు రూ. 1,31,350, బెంగళూరులో 24 క్యారెట్లు, రూ. 1,43,290, 22 క్యారెట్లు రూ. 1,31,350 వద్ద రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,290గా ఉండగా, 22 క్యారెట్లు రూ. 1,31,350 వద్ద స్థిరపడ్డాయి. విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ రేట్లలో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, స్థానిక పన్నులను చేర్చలేదు.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,329, 22 క్యారెట్లు - రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,950

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,329, 22 క్యారెట్లు- రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,747

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,329, 22 క్యారెట్లు- రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,747

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,329, 22 క్యారెట్లు- రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,747

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,329, 22 క్యారెట్లు- రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,747

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,329, 22 క్యారెట్లు- రూ. 13,135, 18 క్యారెట్లు - రూ. 10,747

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+