రూ. 1,40,000 లకు కుప్పకూలిన బంగారం ధర: కొంప కొల్లేరే- ఇంకా డౌన్ ఫాల్.. !!
బంగారం ధరలు నేడు కూడా కుప్పకూలిపోయాయి. వీటి రేట్లు భారీగా తగ్గడం వరుసగా ఇది మూడోరోజు. మున్ముందు ఇంకా తగ్గొచ్చనే అంచనాలు ఉన్నాయి. శనివారం నాటితో పోల్చుకుంటే ఈ ఉదయం బంగారం ధరల్లో ఆరు శాతం మేర క్షీణత కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీలో కిందటి రోజు సాయంత్రం 1,52,345 రూపాయల వద్ద బంగారం ట్రేడింగ్ ముగిసింది. ఇప్పుడు ఆరు శాతం మేర తగ్గుదలతో 1,43,205 రూపాయల వద్ద ట్రేడింగ్ ఆరంభమైంది.
అంతర్జాతీయ మార్కెట్ లో నూ ఇదే తగ్గుదల కనిపించింది. కామెక్స్ లో స్పాట్ బంగారం ధర ఒక ఔన్సుకు 4,879 డాలర్లు పలికింది. కిందటి రోజుతో పోల్చుకుంటే ఇది 8.25 శాతం తగ్గింది. శనివారం దీని ధర 4,945.26 డాలర్లు. కాగా నేడు 4,879 డాలర్లకు క్షీణించింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లల్లో మూడు రోజులుగా చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలు బంగారం కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోన్నాయి. అయోమయ స్థితిలోకి నెట్టాయి.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,38,600 కాగా, 22 క్యారెట్లు రూ. 1,27,050కి తగ్గింది. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,26,950, 24 క్యారెట్ల బంగారం రూ. 1,38,250గా నమోదైంది. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాతో సహా పలు నగరాల్లో 22 క్యారెట్లు రూ. 1,27,050, 24 క్యారెట్లు రూ. 1,38,600కు చేరుకున్నాయి.
స్పాట్ మార్కెట్‌లో వెండి ధరలు కిలోకు రూ. 2,65,600కు చేరింది. గత వారం ₹4 లక్షల రికార్డు స్థాయిని తాకిన తర్వాత, శుక్రవారం ధరలు 27% పతనమై ₹2,90,000కి చేరుకున్నాయి. 1980ల తర్వాత ఇదే అతిపెద్ద ఒకరోజు పతనంగా నిలిచింది. గురువారం సాయంత్రం ₹3,30,000 వరకు పడిపోయి, ఆ తర్వాత కొంత కోలుకోవడం గమనార్హం.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,255, 22 క్యారెట్లు - రూ. 14,900, 18 క్యారెట్లు - రూ. 12,800
ముంబై..
24 క్యారెట్లు - రూ. 17,062, 22 క్యారెట్లు- రూ. 15,640, 18 క్యారెట్లు - రూ. 12,797
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,058, 22 క్యారెట్లు- రూ. 14,720, 18 క్యారెట్లు- రూ. 12,044
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 16,058, 22 క్యారెట్లు- రూ. 14,720, 18 క్యారెట్లు- రూ. 12,044
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,058, 22 క్యారెట్లు- రూ. 14,720, 18 క్యారెట్లు- రూ. 12,044
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,058, 22 క్యారెట్లు- రూ. 14,720, 18 క్యారెట్లు- రూ. 12,044
-
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications