బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత
దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులతో కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,270 రూపాయలకు చేరగా, 22 క్యారెట్లు రూ. 1,35,910 గా నమోదైంది. ఇరాన్-అమెరికా యుద్ధం ఉద్రిక్తతల నేపథ్యంలో నేడు వీటి ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేుంజ్, కామెక్స్ లల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించినా అది నామమాత్రమే. ఈ నెలల్లో గరిష్ట పతనాన్ని చవి చూశాయి బంగారం ధరలు. ఒక నెలలో 16 శాతం పడిపోవడం 2008 తర్వాత ఇదే తొలిసారి.
ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నెలకొన్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,48,240, 22 క్యారెట్లు రూ. 1,36,060గా ఉంది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,48,320కి చేరుకోగా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా వంటి నగరాల్లో ముంబై ధరలే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో బంగారం ధర పది గ్రాములకు 1,80,000 రూపాయలకు పైగా పెరిగి గరిష్ఠ స్థాయికి చేరింది. అదే సమయంలో, వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో రూ.4,20,000 ను తాకాయి.

ప్రపంచ మార్కెట్‌లో, ప్రస్తుత సంవత్సరంలో అమెరికా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం తక్కువని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని పెంచి, ద్రవ్య సడలింపు పరిధిని తగ్గిస్తుందని భావిస్తున్నారు. యుద్ధానికి ముందు రెండు రేట్ల కోత అంచనాలు ఉండేవి. స్వల్ప కాలంలో ద్రవ్యోల్బణం బంగారానికి రక్షణగా పనిచేసినా, అధిక వడ్డీ రేట్లు డిమాండ్‌ను ప్రభావితం చేస్తాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అమెరికా డాలర్ రెండు శాతానికి పైగా పెరగడంతో బంగారం ధర ఈ నెలలో 14 శాతానికి పైగా తగ్గింది. ఇది ఇక్కడితో ఆగకపోవచ్చు. బంగారం ధరల్లో తగ్గుదల 14 నుంచి 17 శాతం వరకు తగ్గొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ తగ్గుదల 2008 అక్టోబర్ తర్వాత బంగారం చూసిన అత్యధిక నెలవారీ పతనం. అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు.. బంగారం ధరలను ప్రభావితం చేస్తోన్నాయి.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,913, 22 క్యారెట్లు - రూ. 13,670, 18 క్యారెట్లు - రూ. 11,460
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,929, 22 క్యారెట్లు- రూ. 13,685, 18 క్యారెట్లు - రూ. 11,197
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,929, 22 క్యారెట్లు- రూ. 13,685, 18 క్యారెట్లు - రూ. 11,197
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,929, 22 క్యారెట్లు- రూ. 13,685, 18 క్యారెట్లు - రూ. 11,197
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,929, 22 క్యారెట్లు- రూ. 13,685, 18 క్యారెట్లు - రూ. 11,197
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,929, 22 క్యారెట్లు- రూ. 13,685, 18 క్యారెట్లు - రూ. 11,197












Click it and Unblock the Notifications