బంగారం ధరలు కుదేల్.. అభద్రతాభావం: దెబ్బతింటోన్న సెంటిమెంట్
అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు, డాలర్ విలువ అనూహ్యంగా పెరిగాయి. దీని ప్రభావం బంగారం ధరలపై నేరుగా పడింది. ఈ ఉదయం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి.
కామెక్స్ లో అంతర్జాతీయ స్పాట్ బంగారం ధర 0.25 శాతం క్షీణించి ఔన్సుకు 3,982.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అదేవిధంగా వెండి ధర కూడా 0.28 శాతం తగ్గి ఔన్సుకు 57.27 డాలర్లకు పరిమితమైంది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో గురువారం నాటి ముగింపుతో పోల్చుకుంటే ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ 1.16 శాతం నష్టపోయింది. 10 గ్రాములకు 760 రూపాయలు క్షీణించింది. రూ.1,40,209 వద్ద స్థిరపడింది. సెప్టెంబర్ వెండి ఫ్యూచర్స్ ధర కూడా 0.16 శాతం నష్టంతో కిలో రూ.2,15,665 వద్ద ముగిసింది.

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల మార్కెట్ వర్గాల్లో అభద్రతాభావం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతూ వస్తోండటం వల్ల భవిష్యత్తులో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధాన నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. మే-జూన్ లో తక్కువ ఇంధన ధరల వల్ల అమెరికా కన్జ్యూమర్ ఇండెక్స్ గణాంకాలు కొంత ఊరటనిచ్చినప్పటికీ, చమురు ధరలు మళ్లీ పెరగడం పసిడి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,345, 22 క్యారెట్లు - రూ. 13,149, 18 క్యారెట్లు - రూ. 10,969
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,253, 22 క్యారెట్లు- రూ. 13,065, 18 క్యారెట్లు - రూ. 10,690
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,253, 22 క్యారెట్లు- రూ. 13,065, 18 క్యారెట్లు - రూ. 10,690
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,253, 22 క్యారెట్లు- రూ. 13,065, 18 క్యారెట్లు - రూ. 10,690
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,253, 22 క్యారెట్లు- రూ. 13,065, 18 క్యారెట్లు - రూ. 10,690
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,253, 22 క్యారెట్లు- రూ. 13,065, 18 క్యారెట్లు - రూ. 10,690

Click it and Unblock the Notifications