కుప్పకూలుతున్న బంగారం ధరలు.. !!
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేడు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఒక ఔన్స్ బంగారం 4,993.44 డాలర్లకు క్షీణించింది. గురువారం నాటితో పోల్చుకుంటే 0.13 శాతం పడిపోయాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్ పై పడింది. బంగారం ధరల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. వెండి ధరలదీ ఇదే పరిస్థితి. ఔన్స్ ఒక్కింటికి 77.92 డాలర్లకు పడింది. ఇందులో 0.74 శాతం క్షీణత కనిపించింది. భారత మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,54,700 రూపాయలుగా నమోదైంది. వీటి ధరలు 0.08 శాతం వరకు తగ్గుముఖం పట్టాయి.
బంగారం ధరలలో ఈ నిరంతర అస్థిరతతో పెట్టుబడిదారులు గందరగోళ పడుతున్నారు. ఆందోళనకు గురవుతున్నారు. ధరలు స్థిరపడి, పెరుగుదల ధోరణి కనిపించినప్పుడు పెట్టుబడి పెడితేనే లాభాలు ఆర్జించవచ్చు. డాలర్ విలువ, అమెరికా ఉద్యోగ మార్కెట్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలు ఈ ధరలను ప్రభావితం చేస్తోన్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడి చేయవచ్చనే వార్తలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఫలితంగా సురక్షిత పెట్టుబడి అయిన బంగారానికి డిమాండ్ పెరుగుతోంది.

నేడు 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 1,54,700 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,42,950 రూపాయలుగా నమోదైంది. అదే సమయంలో వెండి ధర కిలో రూ. 1,89,000 పలుకుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరరూ. 1,56,290, 22 క్యారెట్లు రూ. 1,42,450గా నమోదైంది. ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,56,340, 22 క్యారెట్లు రూ. 1,43,100 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,731, 22 క్యారెట్లు - రూ. 14,420, 18 క్యారెట్లు - రూ. 12,350
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,617, 22 క్యారెట్లు- రూ. 14,315, 18 క్యారెట్లు - రూ. 11,713
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,617, 22 క్యారెట్లు- రూ. 14,315, 18 క్యారెట్లు - రూ. 11,713
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,617, 22 క్యారెట్లు- రూ. 14,315, 18 క్యారెట్లు - రూ. 11,713
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,617, 22 క్యారెట్లు- రూ. 14,315, 18 క్యారెట్లు - రూ. 11,713
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,617, 22 క్యారెట్లు- రూ. 14,315, 18 క్యారెట్లు - రూ. 11,713

Click it and Unblock the Notifications