బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!!
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కొనసాగుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ హైకి చేరిన గోల్డ్ రేట్లు.. నేడు కాస్త చల్లబడినప్పటికీ అది నామమాత్రమే. దీన్ని కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూఎస్ వడ్డీ రేట్ల కోత అంచనాలు, భద్రతా పెట్టుబడుల డిమాండ్ ఈ లోహాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అయ్యాయి. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,41,360గా ఉండగా, 22 క్యారెట్లు రూ. 1,29,590కి లభిస్తోంది. స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹2,50,900గా ఉంది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర 0.17 శాతం పెరిగింది. 10 గ్రాములకు రూ.1,40,106 వద్ద ట్రేడ్ అయింది. వెండి ధర 4.77 శాతం ఎగబాకి కిలోకు రూ. 2,51,231కి నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, జైపూర్, పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,590 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.1,41,360 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. యూఎస్ స్పాట్ బంగారం ధర ఔన్సుకు 4,515.6 డాలర్లకు చేరింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,204, 22 క్యారెట్లు - రూ. 13,020, 18 క్యారెట్లు - రూ. 10,865
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,171, 22 క్యారెట్లు- రూ. 12,990, 18 క్యారెట్లు - రూ. 10,628
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,171, 22 క్యారెట్లు- రూ. 12,990, 18 క్యారెట్లు- రూ. 10,628
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,171, 22 క్యారెట్లు- రూ. 12,990, 18 క్యారెట్లు- రూ. 10,628
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,171, 22 క్యారెట్లు- రూ. 12,990, 18 క్యారెట్లు- రూ. 10,628
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,171, 22 క్యారెట్లు- రూ. 12,990, 18 క్యారెట్లు- రూ. 10,628












Click it and Unblock the Notifications