భారీగా పతనమౌతున్న బంగారం ధరలు.. !!

బంగారం ధరల్లో నేడు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రికార్డు స్థాయి రేటుకు చేరుకున్న పసిడి.. ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బంగారం కొనుగోలుదారుల్లో ఆశలను రేకెత్తిస్తోంది. ఇప్పుడిప్పుడే ఆరంభమైన వీటి ధరల క్షీణత.. ఇక మున్ముందు కూడా కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అంతర్జాతీయ చోటు చేసుకుంటోన్న పరిణామాలు కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోన్నాయి.

గురువారం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయి నుంచి తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, మదుపరుల లాభాల స్వీకరణ ఇందుకు ప్రధాన కారణం. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,43,180గా నమోదైంది. వెండి కిలోగ్రాముకు రూ. 2,95,000 మార్కును తాకి, తర్వాత స్వల్పంగా దిగొచ్చింది. నేడు మదుపరులు లాభాల స్వీకరణతో వీటి ధరల్లో తగ్గుదల కనిపించింది.

Gold Sinks After Hitting MCX s Record High

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఢిల్లీ, జైపూర్‌లో రూ. 1,43,330; అహ్మదాబాద్‌లో రూ. 1,43,230. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో రూ. 1,43,180గా నమోదైంది. 2 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఢిల్లీ, జైపూర్‌లో రూ. 1,31,400; అహ్మదాబాద్‌లో రూ. 1,31,300. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో రూ. 1,31,250గా ఉంది. స్పాట్ మార్కెట్లో వెండి కిలోగ్రాముకు రూ. 295,000తో కొత్త గరిష్ఠ స్థాయిని కూడా చేరుకుంది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,498, 22 క్యారెట్లు - రూ. 13,290, 18 క్యారెట్లు - రూ. 11,090

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,318, 22 క్యారెట్లు- రూ. 13,125, 18 క్యారెట్లు - రూ. 10,739

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,318, 22 క్యారెట్లు- రూ. 13,125, 18 క్యారెట్లు- రూ. 10,739

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,318, 22 క్యారెట్లు- రూ. 13,125, 18 క్యారెట్లు- రూ. 10,739

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,318, 22 క్యారెట్లు- రూ. 13,125, 18 క్యారెట్లు- రూ. 10,739

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,318, 22 క్యారెట్లు- రూ. 13,125, 18 క్యారెట్లు- రూ. 10,739

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+