బంగారం ధరల్లో మిక్స్డ్ ట్రెండ్- అవి పైపైకి.. ఇవి భారీగా డౌన్

దేశీయంగా బంగార ప్రియులకు నేడు కొంత ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం నాటి మార్కెట్ క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే.. దాదాపు ఏడు వారాల గరిష్ట స్థాయిని తాకిన బంగారం ధరలు నేడు నెమ్మదించాయి. వెండి రేట్లల్లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. వీటి ధరలు మాత్రం పురోగతిని సాధించాయి. పైపైకి ఎగబాకాయి.

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటోన్న తాజా పరిణామాలు, అమెరికా ఆర్థిక విధానాలు.. భారతీయ పసిడి రేట్లపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. పసిడి ధరలలో ఈ మార్పులకు గ్లోబల్ మార్కెట్‌లో లాభాల స్వీకరణ ప్రధాన కారణంగా నిలిచింది. పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపడం కూడా బంగారం ధరలు క్షీణించడానికి ఓ కారణమైంది. అటు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాల కోసం ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తోన్నారు.

Gold Slips Globally as Investors Take Profits After 7-Week High despite near US assertions Iran deal

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధరల్లో 0.70 శాతం తగ్గుదల నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,52,050 వద్ద ట్రేడ్ అయ్యాయి. అదే సమయంలో ఎంసీఎక్స్ వెండి ఫ్యూచర్స్ మాత్రం 0.90 శాతం లాభపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కిలోకు రూ. 2,33,030 వద్ద కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్ లో కూడా బంగారం ధరలు క్షీణతను నమోదు చేశాయి. ఇక్కడ స్పాట్ గోల్డ్ 0.5 శాతం నష్టపోయి, ఔన్స్‌కు 4,322.28 డాలర్ల వద్ద నిలిచింది.

100 రోజుల పాలన నాడు సీఎం విజయ్ బిగ్ ప్లాన్: ట్రెండ్ సెట్
100 రోజుల పాలన నాడు సీఎం విజయ్ బిగ్ ప్లాన్: ట్రెండ్ సెట్

యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం తగ్గి 4,381.60 డాలర్లకు పరిమితమైంది. యూరో, స్టెర్లింగ్ వంటి కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే బలోపేతం కావడం కూడా ప్రపంచ మార్కెట్లలో పసిడి, వెండి ధరల గమనాన్ని నిర్దేశించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో పాటు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధరలలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి.

హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో సింహాల జీవన విధానం
హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో సింహాల జీవన విధానం

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,020, 22 క్యారెట్లు రూ. 1,39,352 పలికింది. ఇక్కడ కిలో వెండి రూ. 2,34,300 వద్ద ట్రేడ్ అయింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,51,450, 22 క్యారెట్లు రూ. 1,38,829 కాగా.. వెండి రూ. 2,32,600 వద్ద ట్రేడ్ అయింది. బెంగళూరులో ఇవే రకానికి చెందిన బంగారం ధర రూ. 1,51,570, రూ. 1,38,939 వద్ద స్థిరపడగా వెండి రూ. 2,32,790 నిలిచింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,220 కాగా 22 క్యారెట్లు రూ. 1,39,535, వెండి రూ. 2,34,610గా నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+