బంగారం ధరల్లో భారీ స్లంప్- అమ్మకాల ఒత్తిడితో గడగడ
అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు భారత్ లో బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోన్నాయి. డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడంతో పాటు రాబోయే రోజుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే ఊహాగానాలు పసిడి మార్కెట్‌ను ఒత్తిడిలోకి నెట్టాయి. గత శుక్రవారం చోటుచేసుకున్న తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. నేడు కూడా కొనసాగుతోంది. బంగారం ధరల్లో అదే బలహీన ట్రెండ్ కనిపించింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారులు సెప్టెంబర్ లో వడ్డీ రేట్లను పెంచే దిశగా చేసిన వ్యాఖ్యల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒకే రోజు దాదాపు మూడు శాతం వరకు పతనం అయ్యాయి. అదే క్రమంలో వెండి ధర కూడా 3.5 శాతం మేర పడిపోయింది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో నేడు అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.7 శాతం క్షీణించి 10 గ్రాములకు రూ. 1,56,400 వద్ద ట్రేడ్ అవుతోంది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 2.1 శాతం క్షీణించి కిలో రూ. 2,42,670 కి చేరుకుంది.

శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో 1,470 రూపాయల క్షీణత కనిపించింది. 22 క్యారెట్లల్లో 1,350, 18 క్యారెట్లల్లో 830 రూపాయల మేర తగ్గుదల నమోదైంది. దేశీయంగా రిటైల్ మార్కెట్లల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,56,850 వద్ద నమోదైంది. జ్యువెలరీ తయారీకి ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,45,500 వద్ద స్థిరపడింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం 999 స్వచ్ఛత గల బంగారం రూ. 1,58,386 గా రికార్డయింది. వెండి కిలో ధర రూ. 2,39,500 గా ఉంది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,677, 22 క్యారెట్లు - రూ. 14,370, 18 క్యారెట్లు - రూ. 12,140
ముంబై..
24 క్యారెట్లు- రూ. 15,677, 22 క్యారెట్లు - రూ. 14,370, 18 క్యారెట్లు - రూ. 11,785
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 15,677, 22 క్యారెట్లు - రూ. 14,370, 18 క్యారెట్లు - రూ. 11,785
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 15,677, 22 క్యారెట్లు - రూ. 14,370, 18 క్యారెట్లు - రూ. 11,785
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 15,677, 22 క్యారెట్లు - రూ. 14,370, 18 క్యారెట్లు - రూ. 11,785
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 15,677, 22 క్యారెట్లు - రూ. 14,370, 18 క్యారెట్లు - రూ. 11,785

Click it and Unblock the Notifications