బంగారం ధరలు.. మళ్లీ మొదటికి

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. అమెరికన్ డాలర్ ఇండెక్స్ బలహీనపడటం, ముడి చమురు ధరలు తగ్గడం వంటి అంతర్జాతీయ కారణాలతో పసిడి ధరలను ప్రభావితం చేశాయి. ముంబై మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,51,480కి చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ. 1,38,850గా పలుకుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఉదయం ట్రేడింగ్‌లో బంగారం ధరలు 0.43 శాతం మేర పెరిగి 10 గ్రాములకు 1,51,416 వద్ద ట్రేడ్ అయ్యాయి. వెండి మాత్రం 0.64 శాతతం తగ్గి కిలోకు రూ. 2,39,343కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి ఔన్సుకు 4,685.79 డాలర్ల వద్దకు చేరింది. మార్చి 20వ తేదీ తర్వాత 4,723.21తో అత్యధిక స్థాయిని నమోదుచేయడం ఇదే తొలిసారి. ఏప్రిల్ డెలివరీ కోసం గోల్డ్ ఫ్యూచర్స్ 0.8 శాతం లాభపడి, 4,713.40 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. డాలర్ 0.2 శాతం పడిపోవడంతో ఇతర కరెన్సీలు ఉన్నవారికి డాలర్‌తో విక్రయించే వస్తువులు చౌకయ్యాయి.

Gold Surges to 24K Rs 151480 in Mumbai on April 1 as Dollar Weakens Silver Declines Rs 239343 per kg

నగరాలవారీగా ధరలను పరిశీలిస్తే ఢిల్లీ, జైపూర్ లల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,51,630 వద్ద అత్యధికంగా ఉంది. అహ్మదాబాద్‌లో రూ. 1,51,530ల వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఇది రూ. 1,51,480గా నమోదైంది. 22 క్యారెట్ల ధరలు కూడా స్వల్పంగా మారుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,80,000 దాటి ఆల్-టైమ్ గరిష్ఠాన్ని తాకింది. అదే సమయంలో వెండి కిలోకు రూ. 4,20,000 వద్ద రికార్డు స్థాయికి చేరింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,327, 22 క్యారెట్లు - రూ. 14,050, 18 క్యారెట్లు - రూ. 11,710

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,148, 22 క్యారెట్లు- రూ. 13,885, 18 క్యారెట్లు - రూ. 11,361

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,148, 22 క్యారెట్లు- రూ. 13,885, 18 క్యారెట్లు - రూ. 11,361

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,148, 22 క్యారెట్లు- రూ. 13,885, 18 క్యారెట్లు - రూ. 11,361

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,148, 22 క్యారెట్లు- రూ. 13,885, 18 క్యారెట్లు - రూ. 11,361

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,148, 22 క్యారెట్లు- రూ. 13,885, 18 క్యారెట్లు - రూ. 11,361

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+