Gold Price Today : బంగారం, వెండి ధరలు పతనం.. కొనుగోలుదారులకు పండగ!
పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు రెండు రోజులుగా దిగివస్తున్నాయి. నిన్నటితో పోల్చితే ఈరోజూ కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ గోల్డ్ ధరలు తగ్గడంతో కొనుగోలుదారుల ఆశలు చిగురిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందా..
హైదరాబాద్ , విజయవాడలో ఇలా..
బంగారం ధరలు ఈరోజు కాస్త చల్లబడ్డాయి. 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, హైదరాబాద్ , విజయవాడలలో ఒక గ్రాము ధర రూ. 8215 లుగా ఉంది. మన సాంప్రదాయ కొలమానం ప్రకారం తులం (10 గ్రాములు) బంగారం ధర రూ. 82,150 గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 150 తగ్గింది. ఇది నిజంగా కొనుగోలుదారులకు ఊరటనిచ్చే విషయం.

ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, ధరలు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8962 గా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 89,620 గా ఉంది. నిన్నటి ధరలతో పోల్చితే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 160 తగ్గింది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో కూడా ఇంచుమించు ఇవే ధరలు ఉన్నాయి. స్వచ్ఛమైన బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా ఒక మంచి తరుణం.
ఢిల్లీ, ముంబైలో ఇలా..
అటు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,300 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 89,770 లుగా ఉంది. ముంబై లో చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 82,150 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 89,620 ఉంది.
వెండి వెన్నెల మరింత చల్లబడింది!
బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగి వచ్చాయి. వెండి ధరలు దిగిరావడంతో సామాన్యులకు కూడా వెండి అందుబాటులోకి వచ్చింది. వెండి ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది నిజంగా ఒక మంచి అవకాశం. ఒక గ్రాము వెండి ధర నేడు రూ. 109.90 గా ఉంది. 8 గ్రాముల వెండి ధర రూ. 879.20 గా ఉంది. ఇక 10 గ్రాముల వెండి ధర రూ. 1099 గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే, ఈరోజు వెండి ధర రూ. 1 తగ్గింది.
ధరల తగ్గుదలకు కారణాలు ఏమిటి?
బంగారం , వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడం ఒక ప్రధాన కారణం మారుతుంటాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గితే, దాని ప్రభావం దేశీయ మార్కెట్‌పై కూడా ఉంటుంది. అలాగే, స్థానిక డిమాండ్ , సరఫరా పరిస్థితులు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి. బంగారం , వెండి ధరలు తగ్గిన నేపథ్యంలో, కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు మరియు ఇతర శుభకార్యాల కోసం బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం.












Click it and Unblock the Notifications