Google Pay : గూగుల్ పే యూజర్లకు షాక్.. ఆ లావాదేవీలపై ఛార్జీల మోత.. ఎంతంటే?

గూగుల్ పే లావాదేవిలు జరిపే యూజర్లకు గూగుల్ షాక్ ఇవ్వబోతుంది . ఇప్పటివరకు గూగుల్ పే (Google Pay) ద్వారా చేసే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండేవి కావు. చిన్న చిన్న లావాదేవీల కోసం యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు గూగుల్ పే ప్రయత్నిస్తోంది. ఇకపై కొన్ని రకాల చెల్లింపులపై అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఈ ఛార్జీలు వర్తిస్తాయి. అయితే UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లావాదేవీలు మాత్రం ప్రస్తుతానికి ఉచితంగానే కొనసాగనున్నాయి.

గూగుల‌్ పే ఎంత ఛార్జీలు విధిస్తుంది?:
క్రెడిట్ & డెబిట్ కార్డ్ చెల్లింపుల లావాదేవీ విలువలో 0.5% నుండి 1% వరకు ఛార్జీ విధించబోతుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా విద్యుత్ బిల్లు చెల్లింపు చేసే వాటిపై ₹15 వరకు కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. మొబైల్ రీఛార్జ్‌లపై గూగుల్ పే ఇప్పటికే ₹3 వరకు కన్వీనియన్స్ ఫీజును ప్రవేశపెట్టింది. ఈ ఛార్జీలను "ప్రాసెసింగ్ ఫీజు"గా చూపిస్తున్నారు, ఇందులో GST (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) కూడా కలిపి ఉంటుందని సమాచారం. అయితే దీనిపై గూగుల్ పే అధికారికంగా ప్రకటించలేదు.

Google Pay charges extra on credit and debit card payment transactions

UPI లావాదేవీలపై ఛార్జీలు ఉంటాయా?:
ప్రస్తుతానికి, ప్రభుత్వ విధానాల ప్రకారం UPI లావాదేవీలు ఉచితంగానే ఉన్నాయి. అయితే, గూగుల్ పే వంటి ఫిన్‌టెక్ కంపెనీలు తమ కార్యకలాపాల ఖర్చులను భర్తీ చేసుకోవడానికి కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అయితే ప్రస్తుతం, ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు UPI లావాదేవీలపై ఎటువంటి చార్జీలు విధించలేదు. కానీ, పలు సందర్భాల్లో, బ్యాంకులు, పేమెంట్ ప్రొవైడర్లు, UPI వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేయాలని కోరుతున్నారు. దీని పై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.

ఎందుకు ఈ ఛార్జీలు మోత?:
PwC (ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్) ప్రకారం, UPI ద్వారా చెల్లింపుల ప్రాసెసింగ్‌కు వాటాదారులకు 0.25% ఖర్చు అవుతుంది. బ్యాంకులు, పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు ఉచిత UPI లావాదేవీల ఖర్చును భరిస్తున్నాయి, దీనివల్ల లావాదేవీలపై ఛార్జీలు విధించాలనే డిమాండ్లు పదేపదే చేస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇప్పటివరకు UPI లావాదేవీలను ఉచితంగా ఉంచింది. అయితే, UPI ఛార్జీలపై కనీస ఛార్జీలను ప్రవేశపెట్టడంపై చర్చలు కూడా చాలాసార్లు జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+