పెట్రోల్ పై కేంద్రం ట్యాక్స్ తగ్గించినా వాహనదారులకు దక్కని ఉపశమనం
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాల్లో ఇంధన ధరలలో పెద్దగా మార్పులు లేవు. అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశంలో వినియోగదారులపై భారం పడకుండా ధరలు నిలకడగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 149 డాలర్లకు చేరాయి.
ఈ ప్రభావం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 10 రూపాయల చొప్పున ఎక్సైజ్ ట్యాక్స్ భారాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలేవీ కూడా ఈ పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయట్లేదు. తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల రిటైల్ ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి.

ప్రస్తుతానికి రిటైల్ ధరలను స్థిరంగా కొనసాగిస్తూ పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని తమ నష్టాలను పూడ్చుకోవడానికి వాడుకుంటున్నాయి. ప్రభుత్వ సంస్థలకు భిన్నంగా ప్రైవేట్ రిటైలర్ నయర ఎనర్జీ తన అధిక ఉత్పత్తి వ్యయాలను భర్తీ చేసుకునేందుకు పెట్రోల్‌పై లీటరుకు దాదాపు అయిదు, డీజిల్‌పై మూడు రూపాయల మేర ధరలను పెంచింది. ప్రీమియం పెట్రోల్ వేరియంట్ల ధరలు లీటరుకు దాదాపు రెండు రూపాయల వరకు పెరిగాయి.
ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52












Click it and Unblock the Notifications