సమగ్ర పాడి అభివృద్ధి పథకం: మూడువేల రూపాయలకే.. 90 వేలు విలువైన పాడి పశువు

గిరిజన ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు, ప్రత్యేకించి మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పించడంలో గుజరాత్ ప్రభుత్వ 'సమగ్ర పాడి అభివృద్ధి పథకం' (ఇంటిగ్రేటెడ్ డెయిరీ డెవలప్‌మెంట్ స్కీమ్) అద్భుత ఫలితాలను అందిస్తోంది. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో 2007-08లో ప్రారంభమైన ఈ పథకం, నేడు వేలాది మంది గిరిజన మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ఆత్మగౌరవాన్ని తెచ్చిపెడుతోంది. పశుపోషణ ద్వారా గ్రామీణ మహిళలు సొంత కాళ్లపై నిలబడటమే కాకుండా, తమ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఒక గొప్ప అవకాశంగా మారింది.

మూడేళ్లలో రూ. 162 కోట్లకు పైగా సాయం..

ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 1.96 లక్షలకు పైగా పాడి పశువులను గిరిజన మహిళలకు అందజేశారు. కేవలం గత మూడేళ్ల కాలంలోనే ఏకంగా 29,518 మంది మహిళలకు రూ. 162.28 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. ఇందులో 2023-24లో 6,860 మందికి, 2024-25లో 13,616 మందికి, 2025-26లో 9,042 మందికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. మరింత మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 65 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. దీనివల్ల మరో 11,206 మంది గిరిజన మహిళలు లబ్ధి పొందనున్నారు.

Gujarat Integrated Dairy Development Scheme Empowers Tribal Women With Financial Independence And Support

లబ్ధిదారులపై తగ్గించిన భారం..

ఈ పథకం కింద ఒక్కో పాడి పశువు విలువను రూ. 90,000గా నిర్ణయించారు. ఇందులో పశువు కొనుగోలుతో పాటు దానికి బీమా, రవాణా ఖర్చులు, పశువుల మేత, వైద్య సంరక్షణ, శాస్త్రీయ పశుపోషణపై శిక్షణ వంటివన్నీ చేర్చబడ్డాయి. విశేషమేమిటంటే.. ఈ రూ. 90,000 ఖర్చులో లబ్ధిదారుభరించాల్సింది కేవలం రూ. 3,000 మాత్రమే. మిగిలిన మొత్తంలో రూ. 29,000 కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, రూ. 29,000 రాష్ట్ర ప్రభుత్వ సహాయం, రూ. 29,000 సులువైన రుణం రూపంలో సమకూరుతాయి. ప్రాంతీయ గిరిజన అభివృద్ధి కార్యాలయాల ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు.

Milk Price: పొంగిన పాల ధరలు.. లీటరుపై ఏకంగా 8 రూపాయలు పెంపు
Milk Price: పొంగిన పాల ధరలు.. లీటరుపై ఏకంగా 8 రూపాయలు పెంపు

స్థిరమైన ఆదాయం.. వలసలకు బ్రేక్!

ఈ పథకం ద్వారా గిరిజన కుటుంబాలకు విడతల వారీగా రెండు పాడి పశువులను అందిస్తున్నారు. మొదటి పశువు ద్వారా వచ్చే పాల రాబడితో స్థానిక డెయిరీ కోఆపరేటివ్‌ సొసైటీలకు పాలను సరఫరా చేస్తూ మహిళలు నిరంతర ఆదాయాన్ని పొందుతున్నారు. లభించిన రాబడి నుంచి సగానికి పైగా రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించిన లబ్ధిదారులకు రెండవ పాడి పశువును పొందే అర్హత లభిస్తుంది. దీనివల్ల పాల ఉత్పత్తి రెట్టింపై కుటుంబ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే శాశ్వత ఉపాధి దొరకడంతో గిరిజన కుటుంబాలు పొట్టచేతపట్టుకుని పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితి తప్పింది.

పెరిగిన పాల ధరలు... పొరుగు రాష్ట్రంలో డెయిరీల షాక్!
పెరిగిన పాల ధరలు... పొరుగు రాష్ట్రంలో డెయిరీల షాక్!

14 జిల్లాల్లో పరుచుకున్న పురోగతి..

ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాయకత్వంలో, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి నరేష్ పటేల్ పర్యవేక్షణలో రాష్ట్రంలోని 14 గిరిజన జిల్లాల్లో ఈ పథకం పారదర్శకంగా అమలు జరుగుతోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అత్యంత వెనుకబడిన కుటుంబాలకు ఈ పథకం కొత్త వెలుగులు నింపుతోంది. లభిస్తున్న స్థిరమైన నెలవారీ రాబడితో గిరిజన మహిళలు తమ పిల్లలకు మంచి విద్యను అందిస్తూ, ఆరోగ్య అవసరాలను తీర్చుకుంటూ కుటుంబాలను సంతోషంగా పోషించుకుంటున్నారు. కేవలం ప్రభుత్వ పథకంగా కాకుండా, గిరిజన మహిళల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు ఈ కార్యక్రమం ప్రతీకగా నిలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+