Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

HDFC బ్యాంక్ ప్రతిష్టకు భంగం? వరల్డ్ బ్యాంక్ పదవి కోసమేనా ఈ హైడ్రామా?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఛైర్మన్ పదవికి అతాను చక్రవర్తి సమర్పించిన రాజీనామా ఇప్పుడు కార్పొరేట్, రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. "నా వ్యక్తిగత విలువలు, నీతి నియమాలకు బ్యాంక్‌లోని పద్ధతులు అనుగుణంగా లేవు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అటు పెట్టుబడిదారులను, ఇటు బ్యాంక్ యాజమాన్యాన్ని గందరగోళంలోకి నెట్టాయి. అయితే, ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇంత అస్పష్టమైన కారణాలతో తప్పుకోవచ్చా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

గుజరాత్ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అతాను చక్రవర్తికి ఢిల్లీలోని అధికార వర్గాలతో, ముఖ్యంగా ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. 2021లో ఆయనను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఛైర్మన్‌గా నియమించడం వెనుక ఒక బలమైన వ్యూహం ఉందనే వాదన ఉంది. అప్పట్లో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ను బ్యాంక్‌లో విలీనం చేసే ప్రక్రియ సజావుగా సాగడానికి, ప్రభుత్వం - ఆర్‌బీఐ (RBI) నుంచి సానుకూల సహకారం పొందడానికి దీపక్ పరేఖ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా కేంద్ర బ్యాంకర్లను నియమించే ఈ పదవిలోకి ఒక బ్యూరోక్రాట్ రావడం అప్పట్లోనే చర్చకు దారితీసింది.

HDFC Bank Governance Row Why Atanu Chakraborty s Sudden Resignation is Sparking a Political amp amp Corporate Storm

వ్యక్తిగత విలువలా? కార్పొరేట్ పాలనా?

చక్రవర్తి తన రాజీనామా లేఖలో పేర్కొన్న "వ్యక్తిగత విలువలు" అనే పదం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. కార్పొరేట్ ప్రపంచంలో బోర్డు నిర్ణయాలు 'కార్పొరేట్ గవర్నెన్స్' సూత్రాల ప్రకారం జరగాలి తప్ప, ఒక వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద కాదు. గత రెండేళ్లుగా తాను గమనించిన ఏ సంఘటనలు ఆయనను నొప్పించాయో స్పష్టంగా వివరించకపోవడం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసే చర్యగా కనిపిస్తోంది. రుణాల పంపిణీలో లోపాలా? లేక పెట్టుబడుల విషయంలో విభేదాలా? అన్నది స్పష్టం చేయకుండా కేవలం అస్పష్టమైన ఆరోపణలు చేయడం ఒక బ్యాంక్ ఛైర్మన్‌కు తగని పని అని నిపుణులు విమర్శిస్తున్నారు.

HDFCలో రాజీనామా భూకంపం, విలువలు వర్సెస్ విధానాలు!
HDFCలో రాజీనామా భూకంపం, విలువలు వర్సెస్ విధానాలు!

గత వివాదాలు.. పట్టుబట్టే తత్వం!

ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసిన కాలంలో కూడా చక్రవర్తి తన నిర్ణయాల విషయంలో పట్టుదలకు పోయేవారనే గుర్తింపు ఉంది. ఉదాహరణకు, గతంలో పీఎఫ్‌సి (PFC), ఆర్ఈసీ (REC) విలీనం విషయంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఒప్పించి, ప్రభుత్వంపై భారీ వ్యయం పడేలా నిర్ణయాలు తీసుకోవడం.. ఎల్ఐసీ ఐపీఓ విషయంలో జోక్యం చేసుకోవడం వంటివి ఆయన పనితీరుకు నిదర్శనాలు. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కూడా కీలక నిర్ణేతగా తన ముద్ర వేయాలని ప్రయత్నించి, మేనేజ్‌మెంట్ నుంచి ప్రతిఘటన ఎదురవడంతోనే ఈ 'నైతికత' అస్త్రాన్ని ప్రయోగించారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Credit Card వినియోగదారులకు షాక్, వార్షిక ఫీజు రెట్టింపు
Credit Card వినియోగదారులకు షాక్, వార్షిక ఫీజు రెట్టింపు

ఆర్‌బీఐ క్లీన్ చిట్.. తదుపరి లక్ష్యం అదేనా?

చక్రవర్తి చేసిన ఆరోపణలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. "బ్యాంక్ పాలనలో ఎటువంటి లోపాలు లేవు" అని స్పష్టం చేస్తూనే, ఆయన రాజీనామాను తక్షణమే ఆమోదించింది. అంతేకాకుండా, కీకి మిస్త్రీని తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించడంలో వేగంగా స్పందించింది. అయితే, చక్రవర్తి ఇంత హడావిడిగా తప్పుకోవడం వెనుక మరో కారణం ఉందనే చర్చ నడుస్తోంది. బహుశా ప్రపంచ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి ఉన్నత స్థాయి అంతర్జాతీయ పదవి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని, అందుకే ఒక సంచలనంతో ఈ పదవి నుంచి వైదొలిగారని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+