దీపావళికి హ్యుందాయ్ బిగ్ సర్‌ప్రైజ్.. రూ.10 లక్షల లోపే అదిరిపోయే ఫీచర్లు!

దీపావళి పండుగ సీజన్ ను పురస్కరించుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ భారత మార్కెట్లోకి సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'హ్యుందాయ్ బయాన్'ను లాంచ్ చేసింది. అక్టోబర్ 26, 2026న అధికారికంగా విడుదలైంది. రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో(ఎక్స్-షోరూమ్) లభించే ఈ కారు.. క్రెటా ధర ఎక్కువ అనిపించే వారికి, వెన్యూ సైజ్ చిన్నదిగా భావించే కొనుగోలుదారులకు సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. కేవలం రూ.11,000 చెల్లించి ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటింంచింది.

ఇకపై కార్లు తనంతట తావే బ్రేక్ వేసుకుంటాయి.. కేంద్రం సంచలన గెజిట్!
ఇకపై కార్లు తనంతట తావే బ్రేక్ వేసుకుంటాయి.. కేంద్రం సంచలన గెజిట్!

కొలతలు, డిజైన్
హ్యుందాయ్ బయాన్ పొడవు 4,245 మిమీ, వెడల్పు 1,810మిమీ, ఎత్తు 1,605 మిమీ, వీల్‌బేస్ 2,600 మిమీగా ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 205 మిమీ. పరిమాణ పరంగా ఇది వెన్యూ కంటే 250 మిమీ పొడవు, కానీ క్రెటా కంటే 85 మిమీ చిన్నది. హ్యాందాయ్ 'ఆర్ట్ ఆఫ్ స్టీల్' డిజైన్ థీమ్‌తో తెరకెక్కిన ఈ కారు ఫ్రంట్ లుక్ హ్యాందాయ్ టుసాన్ మోడల్‌ను పోలి ఉంటుంది. దీని ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌లాంప్ సెటప్, హెచ్ ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్, స్టైలిష్ బంపర్ క్లాడింగ్ ఇచ్చారు.

Hyundai Bayon Launched at Rs 9 99 Lakh Creta Alternative SUV Features and Specifications Full Details

ఇంజన్, పనితీరు
ఈ ఎస్‌యూవీలో 1.5-లీటర్ ఎంపీఐ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 115 bhp పవర్, 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. మైలేజ్ పరంగా లీటరుకు 18.6 కిలోమీటర్ల వరకు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా ఈ కారులో ఈకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లతో పాటు ఓవర్ టేకింగ్ వేగాన్ని పెంచే 'డాష్ బూస్ట్ మోడ్', ప్యాడల్ షిఫ్టర్లు కూడా ఉన్నాయి. 2027 జనవరిలో దీని సీఎన్‌జీ వేరియంట్‌ను కూడా తీసుకురానున్నారు.

రూ. 6.30 లక్షల ధర.. 35కిలోమీటర్ల మైలేజ్: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఫ్యామిలీ కార్!
రూ. 6.30 లక్షల ధర.. 35కిలోమీటర్ల మైలేజ్: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఫ్యామిలీ కార్!

ప్రీమియం కేబిన్, అధునాతన సాంకేతికత
హ్యుందాయ్ క్యాబిన్‌లో 12.3 అంగుళాల డ్యూయల్ స్క్రీన్ సెటప్‌ను అందించారు. ఒకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. భారతీయ మార్కెట్లో మొదటిసారికి హ్యూందాయ్ కారులో జనరేటివ్ ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్‌ను అందించడం విశేషం. దీని ద్వారా డ్రైవర్ కారుతో సాధారణ సంభాషణ తరహాలోనే మాట్లాడవచ్చు. వీటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, బోస్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూప్, 70కి పైగా ఫీచర్లతో బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

భద్రత, ఎగుమతులు
భద్రత విషయానికి వస్తే.. ఇందులో 35కు పైగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇచ్చారు. 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, 360-డిగ్రీ కెమెరా, టీపీఎంఎస్, ఆల్-విల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 12 రాడార్ సెన్సార్లతో కూడిన లెవెల్-2 ADAS ప్రో ప్యాకేజీ లభిస్తుంది. ఈ కారు భారత్ NCAP క్రష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. చెన్నై ప్లాంట్‌లో తయారయ్యే హ్యుందాయ్ బయాన్‌ను భారత్‌తో పాటు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లోని 50 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు హ్యుందాయ్ ఇండియా ఎండీ తరుణ్ గర్గ్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+