ICICI ఖాతాదారులకు షాక్! చార్జీల మోత.. ఎఫ్‌డీపై సూపర్ వడ్డీ!
ఖాతాదారుల జేబులకు చిల్లు పెట్టేలా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి పలు సేవలపై చార్జీలను పెంచుతూ నిర్ణయం వెలువరించింది. ముఖ్యంగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిపే వారికి ,ఈఎంఐలు కట్టే వారికి ఈ భారం మోయక తప్పదు. రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే సామాన్యులు ఈ కొత్త నిబంధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే.
బ్యాంక్ బ్రాంచ్‌లలో లేదా క్యాష్ రీసైక్లర్ మెషీన్ల ద్వారా నగదు డిపాజిట్ చేయడం లేదా డ్రా చేయడం ఇకపై మరింత ప్రియం కానుంది. నెలవారీగా ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత ప్రతి వెయ్యి రూపాయలకు ఇప్పటివరకు ఉన్న 3 రూపాయల 50 పైసల చార్జీని 4 రూపాయలకు పెంచారు. అయితే నెలవారీగా ఎలాంటి చార్జీలు లేకుండా మూడుసార్లు ఉచితంగా లావాదేవీలు చేసుకోవచ్చు. అలాగే నెలకు లక్ష రూపాయల వరకు ఎలాంటి విలువ ఆధారిత చార్జీలు వర్తించవు. ఈ లిమిట్ దాటితే మాత్రం వేయి రూపాయలకు 4 రూపాయలు లేదా 150 రూపాయలు (ఏది ఎక్కువ అయితే అది) వసూలు చేస్తారు.

ఈఎంఐ చెల్లించేవారికి డబుల్ టెన్షన్
కేవలం నగదు లావాదేవీలే కాకుండా ఈసీఎస్ (ECS) ,నాచ్ (NACH) ద్వారా జరిగే ఆటోమేటిక్ డెబిట్ ఫెయిల్యూర్లపై కూడా బ్యాంక్ భారీ పెనాల్టీలను విధిస్తోంది. అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఈఎంఐ లేదా ఇతర ఆటోమేటిక్ చెల్లింపులు బౌన్స్ అయితే జరిమానా తప్పదు. డిసెంబర్ 1 నుంచి మొదటిసారి ఫెయిల్ అయితే 500 రూపాయలు, ఆ తర్వాత రెండు, మూడు సార్లు బౌన్స్ అయితే ప్రతిసారీ 550 రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు. లోన్ ఈఎంఐలు కట్టే వారు నిర్ణీత తేదీకి ముందే ఖాతాలో సరిపడా డబ్బులు ఉండేలా చూసుకోవడం మంచిది.
జీరో బ్యాలెన్స్ ఖాతాదారులకు ఊరట.. కానీ అప్రమత్తత అవసరం
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనతో పాటు ఇతర బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లు (BSBDA) కలిగిన వారికి నగదు లావాదేవీల చార్జీల నుంచి మినహాయింపు కొనసాగుతుంది. ఈ ఖాతాలకు క్యాష్ డిపాజిట్లు, విత్‌డ్రాల చార్జీలు నిల్ గానే ఉంటాయి. అయితే, ఈసీఎస్ లేదా నాచ్ డెబిట్ రిటర్న్ పెనాల్టీలు మాత్రం వీరికి కూడా వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. కాబట్టి ఖాతాదారులు అందరూ ఒకే రకమైన టారిఫ్ ఉంటుందని భావించకుండా, తమది ఏ రకమైన అకౌంట్ అనే విషయాన్ని పరిశీలించుకోవడం ఉత్తమం.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
మరోవైపు సేవింగ్స్ చార్జీలు పెరుగుతున్న తరుణంలో, ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై ఇస్తున్న రిటర్న్స్ గురించిన వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మూడు సంవత్సరాల ఒక రోజు నుంచి ఐదేళ్ల కాలపరిమితి గల ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు గరిష్టంగా 6.50 శాతం వడ్డీ లభిస్తుండగా, సీనియర్ సిటిజెన్లకు ఇదే కాలపరిమితిపై ఏకంగా 7.10 శాతం వరకు అత్యధిక వడ్డీ అందుతోంది. తక్కువ కాలపరిమితి ఉండే డిపాజిట్లపై కూడా వివిధ స్లాబుల వారీగా వడ్డీ రేట్లు వర్తిస్తాయి. మొత్తానికి డిసెంబర్ మొదటి వారం నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త మార్పులు అకౌంట్ హోమ్ పనులపై ఖచ్చితమైన ప్రభావం చూపనున్నాయి.














Click it and Unblock the Notifications
