2018లో బడ్జెట్: ‘మౌలికం’తో చేనేత ఎగుమతుల పెరుగుదల

ముంబై: ప్రభుత్వానికి ఎగుమతుల ద్వారా ఆదాయం సమకూర్చిన చేనేత రంగానికి వచ్చే బడ్జెట్‌లో నిధులు పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తం ఎగుమతుల్లో 13 శాతం ఆదాయం చేనేత దుస్తుల ఎగుమతుల ద్వారా వచ్చింది. ఇతర దేశాలకు దీటుగా నాణ్యమైన వస్త్రాలు నేసి, విదేశాలకు వస్త్ర ఎగుమతులతో ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న చేనేత రంగం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నది.

అంతర్జాతీయంగా పలు ప్రతికూల పరిస్థితులు నెలకొన్న తరుణంలో తీవ్రమైన పోటీ మధ్య చైనా ఉత్పత్తులు తగ్గడంతో దేశీయ చేనేత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. కానీ ఎగుమతులతో ఆదాయం తెచ్చి పెట్టిన చేనేత రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లెవీ, వడ్డీరేటు వారికి పున:చెల్లించేందుకు నిధులు భారీగానే కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

చేనేతతోనే ఎగుమతుల ఆదాయం

ఎగుమతుల రంగంలో భారత్ ఆదాయం పెంచుకోవాలంటే పూర్తిగా చేనేత రంగమే దారి. కనుక భవిష్యత్‌లో చేనేత రంగానికి టెక్నాలజీ అప్ గ్రేడ్ చేయడానికి నిధుల కేటాయింపులు 2014 - 15లో కేటాయింపులతో పోలిస్తే 23 శాతం తగ్గుముఖం పట్టాయి. 2016 - 17లో రూ.2610 కోట్లు కేటాయిస్తే, 2017 - 18లో రూ.2013 కోట్లు మాత్రమే కేటాయించారు.

ICRA Expects Increase in Budgetary Allocation To Improve Textile Export

సబ్సిడీలే చేనేతకు కీలకం
చేనేత రంగంలో సబ్సిడీలు ఇవ్వడమే ఆ రంగంలో పెట్టుబడులకు కీలకం
కానున్నది. టెక్నాలజీ ఆధునీకరణ, సాంకేతికంగా సామర్థ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. భారీగా నిధులను కేటాయించడం వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు ఎగుమతుల ద్వారా ఫారెక్స్ నిధులు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

ఇలా మూడున్నర రెట్ల ఎగుమతుల పెరుగుదల
ఒకవేళ అప్పారెల్ ఎగుమతుల్లో ముడి సరుకు ఎగుమతి చేస్తే ఎగుమతులు మూడు నుంచి మూడున్నర రెట్లు పెరుగుతాయి. చేనేత ఎగుమతుల్లో 50 శాతం ఖాదీ ఉత్పత్తులది. అన్ని రకాలుగా వసతులు కల్పిస్తే ఖద్దరు ఉత్పత్తుల ఎగుమతులు 50 శాతం పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ICRA Expects Increase in Budgetary Allocation To Improve Textile Export

చేనేతకు చిన్న, మధ్య తరహా రంగం ఆధారం
చేనేత రంగం పూర్తిగా చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగంపై ఆధార పడి ఉంది. చేనేత రంగానికి మౌలిక వసతులు అందుబాటులో లేక పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాదు చేనేత రంగ పరిశ్రమ చెదిరిపోయి ఉన్నది. టెక్స్ టైల్ పార్కులకు నిధులు కేటాయిస్తే, ఆర్థిక చేయూతనిచ్చి మౌలిక వసతులను బలోపేతం చేస్తే చేనేత రంగానికి సత్ఫలితాలు లభిస్తాయని చెప్తున్నారు. ఈ దిశగా నిధుల కేటాయింపుల్లో వెసులుబాటు కల్పిస్తే చేనేత రంగం ద్వారా జీడీపీ పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+