బంగారం లాంటి జాబ్ వదిలేసి.. జైన్ సన్యాసినులైన తల్లీకూతుళ్లు!

చదువు పూర్తికాగానే కోట్లు సంపాదించాలనేది నేటి యువత కల. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో డిగ్రీలు.. అంతర్జాతీయ కంపెనీల్లో లక్షల్లో జీతాలు.. లగ్జరీ కార్లు, హైఫై లైఫ్‌స్టైల్.. ఇవే అందరి జీవితాల పరమార్థం అనుకుంటారు. కానీ, గురుగ్రామ్‌కు చెందిన 37 ఏళ్ల అక్షిత జైన్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన దారిని ఎంచుకున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేసి, ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌లో ఏటా రూ. 50 లక్షల జీతం తీసుకుంటున్న ఆమె.. ఆ రాజభోగాలన్నింటినీ ఒకే ఒక్క క్షణంలో వదిలిపెట్టేశారు. సంసారిక బంధాలను తెంచుకుని, అహింసా మార్గంలో ఆధ్యాత్మిక బాట పట్టారు.

ఒంటరిగా కాదు.. ఏకంగా తల్లితో కలిసి..

ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అక్షిత ఒక్కరే లేరు. ఆమెతో పాటు ఆమె 61 ఏళ్ల తల్లి శిరోమణి బజాజ్ కూడా ఈ కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నారు. శిరోమణి గారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) లో చీఫ్ మేనేజర్‌గా సుదీర్ఘకాలం పని చేసి రిటైరయ్యారు. భర్త మరణం తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ విజయవంతంగా పూర్తి చేసిన ఆమె, ఇప్పుడు కూతురితో కలిసి జైన సన్యాస మార్గంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లు ఇద్దరూ ఇలా లౌకిక ప్రపంచాన్ని విడిచిపెట్టి జైన సాధ్విలుగా మారుతుండటం స్థానికంగా సంచలనంగా మారింది.

IIM Bangalore MBA Graduate Quits Rs 50 Lakh Volkswagen Job To Embrace Jain Asceticism Alongside Retired IOCL Mother
డిసెంబర్ 15 వరకు కొత్త జాబ్ వెతుక్కోండి.. టెక్ ఉద్యోగులకు బిగ్ షాక్!
డిసెంబర్ 15 వరకు కొత్త జాబ్ వెతుక్కోండి.. టెక్ ఉద్యోగులకు బిగ్ షాక్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెచ్చిన మార్పు..

అక్షిత అంత మంచి కార్పొరేట్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆమె తన ఉద్యోగంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై పని చేస్తున్న సమయంలోనే ఆమె మనసులో ఈ మార్పు మొదలైందట. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం భారీగా భూమిని తవ్వడం వల్ల, నేలలో ఉండే సూక్ష్మ జీవులకు తీవ్రమైన హాని కలుగుతుందని, పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లుతుందని ఆమె గుర్తించారు. ఈ ఆలోచనే జైన మత ప్రధాన సూత్రమైన 'అహింస' వైపు ఆమెను నడిపించింది. సమస్త జీవకోటిపై ఎటువంటి హింస జరగకూడదనే ఉన్నత భావనతోనే ఆమె ఆ లగ్జరీ ఉద్యోగాన్ని వీడాలని నిర్ణయించుకున్నారు.

46 లక్షల రూపాయల జాబ్ వదిలేసి.. ఆర్మీ యూనిఫామ్‌ కోసం కుర్రాడి పోరాటం!
46 లక్షల రూపాయల జాబ్ వదిలేసి.. ఆర్మీ యూనిఫామ్‌ కోసం కుర్రాడి పోరాటం!

కఠిన దీక్షకు సిద్ధమైన తల్లీకూతుళ్లు..

మరోవైపు తల్లి శిరోమణి గారు కూడా 37 ఏళ్ల సర్వీస్ తర్వాత 2025 అక్టోబర్‌లో ఐఓసీఎల్ నుంచి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత జైన సాధ్విల సావాసంతో ఆమెకు ఆధ్యాత్మికతపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ తల్లీకూతుళ్లిద్దరూ ప్రముఖ జైన గురువు సాధ్వి పూర్ణప్రజ్ఞశ్రీజీ మార్గదర్శకత్వంలో అడుగులు వేస్తున్నారు. సన్యాస స్వీకారానికి ముందుగా జోదాపూర్లో ఘనంగా 'వర్ఘోడ' (జైన ఊరేగింపు) నిర్వహించగా.. ఫిబ్రవరి 25న చెన్నై వేదికగా వీరు అధికారికంగా దీక్ష తీసుకుని సంపూర్ణ సన్యాసినులుగా మారనున్నారు. లౌకిక సుఖాలను, బంధాలను త్యజించి వీరు చేపట్టిన ఈ సాహసోపేతమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+