భద్రత విషయంలో నో కాంప్రమైజ్.. ఎలన్ మస్క్ తొందరపాటుకు భారత్ చెక్!

భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించేందుకు ఎలన్ మస్క్ తన కంపెనీ స్టార్‌లింక్ ద్వారా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే భద్రతా కారణాల వల్ల లైసెన్స్ మంజూరులో ఆలస్యం అవుతుండటంతో ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వ్యాపారపరంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్ కావడంతో స్టార్‌లింక్ ఇండియాలో పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 165 దేశాల్లో తమకు లైసెన్సులు ఉన్నాయని.. భారత్‌లో కూడా నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని ఎలన్ మస్క్ పేర్కొంటున్నారు.

ఎలాన్ మస్క్ 'స్టార్ లింక్' ట్వీట్ పై రాహుల్ గాంధీ రిప్లై ఇదే..
ఎలాన్ మస్క్ 'స్టార్ లింక్' ట్వీట్ పై రాహుల్ గాంధీ రిప్లై ఇదే..

అయితే భారత్ మాత్రమే కాకుండా అమెరికా కూడా జాతీయ భద్రత విషయంలో అత్యంత కఠినమైన వైఖరిని అవలంభిస్తుంది. భద్రతను నెపంగా చూపిస్తూ విదేశీ టెక్నాలజీలు, నెట్వర్క్ పరికరాలు, కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లపై అమెరికా ఎప్పటికప్పుడు కఠిన ఆంక్షలు విధిస్తూనే ఉంది. స్వదేశంలో విదేశీ కంపెనీలకు భద్రతా కారణాలతో చెక్ పెట్టే అమెరికా.. ఇతర దేశాలు తమ భద్రతా ప్రమాణాలను పాటించడాన్ని ప్రశ్నించడం విమర్శలకు తావిస్తోంది.

India Checks Elon Musk Starlink Entry No Compromise on Security applying strict regulatory checks

చైనా, రష్యా వంటి దేశాలకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలపై అమెరికా నిషేధం విధిస్తోంది. చైనాకు చెందిన హువాయ్, జెడ్‌టీఈ కంపెనీల కమ్యూనికేషన్ పరికరాలు, 5జీ నెట్వర్క్ గేర్‌లు అమెరికా ప్రభుత్వం, మిలిటరీ మౌలిక సదుపాయాల్లో ఉపయోగించకుండా పూర్తిగా అడ్డుకుంది. వీటి ద్వారా చైనా ప్రభుత్వం నిఘా పెట్టే అవకాశం ఉందని అమెరికా ఆరోపిస్తోంది. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సర్వైలెన్స్ కెమెరాల తయారీ సంస్థ హిక్‌విజన్ పరికరాలపై, రష్యాకు చెందిన ప్రముఖ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ కాస్పెర్‌స్కీపై కూడా అమెరికా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.

మస్క్ స్టార్‌లింక్ ఆరోపణల ఎఫెక్ట్? రిలయన్స్ షేర్లు 2.6% డౌన్..!!
మస్క్ స్టార్‌లింక్ ఆరోపణల ఎఫెక్ట్? రిలయన్స్ షేర్లు 2.6% డౌన్..!!

సామాజిక మాధ్యమం టిక్‌టాక్ విషయంలోనూ అమెరికా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, సైనిక అధికారుల ఫోన్లలో టిక్‌టాక్ వినియోగాన్ని పూర్తి నిషేధించారు. యూజర్ల డేటా దుర్వినియోగం కావడం లేదా కంటెంట్ ఆధారంగా ప్రభావితం చేయడం వంటి ముప్పులు ఉన్నాయని నిషేధం విధించారు. సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, టెలికాం రంగాల్లో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు అమెరికా డీకప్లింగ్ విధానాన్ని అనుసరిస్తోంది.

ఈ నేపథ్యంలో భారత్ కూడా శాటిలైట్ ఇంటర్నెట్ అనుమతుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడాన్ని సమర్థించుకోవచ్చు. శాటిలైట్ సేవలు నేరుగా అంతరిక్షం నుంచి అందుతాయి కాబట్టి భారత వినియోగదారుల డేటా ఏ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. అత్యవసర సమయాల్లో నిఘా లేదా నెట్వర్క్ నిలిపివేత చర్యలను ప్రభుత్వం ఎలా నియంత్రించగలదనే అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం.. స్టార్‌లింక్ మాత్రమే కాకుండా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి సంస్థలు కూడా ఇదే విధమైన భద్రతా తనిఖీల ప్రక్రియలో ఉన్నాయి. దేశ భద్రత ప్రాథమిక హక్కు కావడంతో ఎలాంటి తొందరపాటు లేకుండా తగిన నిబంధనలు ఖరారు చేశాకే అనుమతులు ఇవ్వడం భారత్ వ్యూహంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+