బంగారం ధరలకు గత వైభవం

పసిడి ధరలు నేడు గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 2.80 శాతం పెరిగి 4,650.20 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్ లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,980 రూపాయల వరకు ఎగబాకింది ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి సగటున 1,50,628 లక్షల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు బంగారం, వెండి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయి.

అలాగే యూఎస్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలలో మార్పులు లాభాల స్వీకరణకు దారితీశాయి. అంతకుముందు వారంలో బంగారం 4,800 డాలర్లకు పైగా రికార్డు స్థాయిలను తాకిన విషయం తెలిసిందే. దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు 1,50,470, 22 క్యారెట్లు 91.6 శాతం స్వచ్ఛమైనది 10 గ్రాములకు 1,38,550, 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,12,130 రూపాయల వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.

India Gold Rates Edges to 1 50 Lakh per 10g Amid Global Rebound As Its Rally US Rate Cut

ప్రధాన నగరాలలో 24 క్యారెట్ల పసిడి ధరలు (10 గ్రాములకు) ఇలా ఉన్నాయి: ఢిల్లీ- రూ. 1,50,220, ముంబై- రూ. 1,49,970, హైదరాబాద్- రూ. 1,49,970, చెన్నై- రూ. 1,50,180; కోల్‌కతా- రూ. 1,49,970గా నమోదయ్యాయి. ఆభరణాల కొనుగోలుపై మూడు జీఎస్టీతో పాటు, డిజైన్‌ను బట్టి అయిదు నుండి 35 శాతం వరకు తయారీ ఛార్జీలు వర్తిస్తాయి. 10 రోజులుగా బంగారం ధరలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఏప్రిల్ 1న 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 15,310 వద్ద గరిష్టాన్ని నమోదు చేయగా, ఆ తర్వాత తగ్గుముఖం పట్టి నేడు రూ. 14,911కి చేరింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,109, 22 క్యారెట్లు - రూ. 13,850, 18 క్యారెట్లు - రూ. 11,545

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+