పేలిన డీజిల్ ట్యాక్స్ బాంబు- భారీగా పెంపు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఎగుమతి సుంకాలను భారీగా పెంచింది. ప్రత్యేకించి డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ట్యాక్స్ ను ఎకాఎకిన సవరించింది. పెట్రోల్‌పై ఎగుమతి సుంకం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ఇందులో ఎటువంటి సవరణలు చేయలేదు కేంద్రం. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, రోజురోజుకూ ముడిచమురు ధరలు పెరుగుతోండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా సవరించిన ధరల ప్రకారం.. డీజిల్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 21.50 పైసల నుండి రూ. 55.50 పైసలకు పెరిగింది. ఒకేసారి 36 రూపాయల మేర పెరుగుదల చోటుచేసుకుంది ఇందులో. హై స్పీడ్ డీజిల్‌పై కూడా ట్యాక్స్ భారం పడింది. దీనిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ ను వేసింది కేంద్రం. పెంపు తర్వాత లీటరు ఒక్కింటికి 24 రూపాయలకు చేరుకుంది. రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఇప్పుడు లీటరుకు 36 రూపాయలుగా నిర్ణయించింది.

అదేవిధంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతి ట్యాక్స్ లీటరుకు రూ. 29.50 పైసల నుండి 42 రూపాయలకు పెరిగింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అధిక ఇంధన ధరలు విమాన టిక్కెట్లపై పడకుండా ఉండటం, అంతర్జాతీయ చమురు ధరల అస్థిరత ప్రభావం పౌర విమానయాన రంగం, ప్రయాణికులపై పడకుండా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పన్నులు, ఇతరత్రా ఎక్సైజ్ డ్యూటీలపై సమీక్ష కొనసాగుతోందని పేర్కొంది.
ఇదివరకు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు పారిశ్రామిక డీజిల్ ధరను 25 శాతం మేర పెంచిన విషయం తెలిసిందే. దీంతో బల్క్ కొనుగోలుదారులకు ఇప్పుడు లీటరు రూ. 137.81 చెల్లించాల్సి వస్తోంది. ఇది మునుపటి ధర కంటే రూ. 28.22 అధికం. ప్రస్తుతానికి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ముడిచమురు మార్కెట్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, భారతీయ చమురు కంపెనీలు సామాన్య వినియోగదారులపై అదనపు భారాన్ని మోపట్లేదు.
వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52
-
లీటర్ పెట్రోల్ కేవలం 3 రూపాయలకే.. మీకు కావాలా ?? -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది












Click it and Unblock the Notifications