డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్

దేశీయ రిఫైనరీలు ఇరాన్ చమురు దిగుమతులను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఉత్పన్నమైన ఇంధన కొరతను తగ్గించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తేయడంతో, ఆసియాలోని ఇతర రిఫైనరీలు కూడా ఇటువంటి చర్యలను పరిశీలిస్తున్నాయని రాయిటర్స్ శనివారం తెలిపింది. దాదాపుగా 30 రోజుల పాటు ఆంక్షలను ట్రంప్ సడలించారు.

రాయిటర్స్ నివేదిక ప్రకారం, భారతీయ రిఫైనింగ్ కంపెనీలు ఇరాన్ చమురు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి. కొనుగోళ్లు, ధర, చెల్లింపు విధానాలపై కేంద్ర ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాల కోసం వేచి చూస్తున్నాయి. ఇతర ప్రధాన ఆసియా దిగుమతిదార్ల కంటే తక్కువ ముడి చమురు నిల్వలున్న భారత్.. యూఎస్ ఆంక్షలు తొలగిపోగానే రష్యా చమురును సేకరించినట్లే ఇప్పుడు ఇరాన్ ఆయిల్ పైనా దృష్టి పెడుతోంది.

India looking resume Iranian Oil purchases as temporary US easing weighs on markets for 30 Days

భారత్ లాగే ఆసియాలోని అనేక రిఫైనరీలు ఇరాన్ సరఫరాలను పరిశీలిస్తున్నాయని రాయిటర్స్ తెలిపింది. యూఎస్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ జారీ చేసిన ఈ మినహాయింపు, తాత్కాలిక ఆంక్షల ఎత్తివేత.. ఈ నెల 20న లేదా అంతకు ముందు లోడ్ అయి, ఏప్రిల్ 19 నాటికి అన్‌లోడ్ అయ్యే చమురు మాత్రమే వర్తిస్తుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అమెరికా ఈ ఆంక్షలను తాత్కాలికంగా సడలించడం ఇది మూడోసారి.

ఈ నిర్ణయంతో మిలియన్ల బ్యారెళ్ల కొద్దీ చమురును సరఫరా చేయడానికి ఇరాన్ కు వెసలుబాటు లభించింది. కెప్లర్ డేటా ప్రకారం - దాదాపు 170 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురు ప్రస్తుతం సముద్రంలో ఉంది. ఎనర్జీ ఆస్పెక్ట్స్ అంచనా ప్రకారం, ఇది 130-140 మిలియన్ బ్యారెళ్లకు సమానం. ఆసియా తన ముడి చమురు దిగుమతులలో దాదాపు 60 శాతం పశ్చిమాసియా దేశాలపైనే ఆధారపడి ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతపడటంతో రిఫైనరీలు ఉత్పత్తి తగ్గించాయి.

ఇది ఆసియాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2018 ఆంక్షలకు ముందు, ఇండియా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు ఇరాన్ నుండి ప్రధాన కొనుగోలుదారులు. డిస్కౌంట్ల కారణంగా ఇరాన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా మారింది చైనా. అయినప్పటికీ, చెల్లింపు విధానాలు, లాజిస్టిక్స్ పై అనిశ్చితులు ఉన్నాయని రాయిటర్స్ పేర్కొంది. కాగా- అమెరికా నిర్ణయాన్ని ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ వ్యతిరేకించింది. అంతర్జాతీయ మార్కెట్లకు తక్కువ మిగులు ముడి చమురు అందుబాటులో ఉందని ఏఎన్ఐ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+