పాత సామాన్లు కొంటాం.. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో వాళ్లే ఫస్ట్!
ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ వస్తువుల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ ఎంఎంఆర్ ప్రకారం.. ఈ మార్కెట్ 2024లో 523.29 బిలియన్ డాలర్లు కాగా.. 2032 నాటికి ఇది 1451.34 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ కాలంలో సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఏటా 13.6 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది.
సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేయడంలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు ఇవే..
ఒక సర్వే ప్రకారం.. సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేయడంలో ఆస్ట్రేలియా ప్రజలు మొదటి స్థానంలో ఉన్నారు. గత 12 నెలల్లో 62 శాతం మంది ఆస్ట్రేలియన్లు సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేశారని సర్వేలో వెల్లడైంది. ఈ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో 60 శాతం మంది ప్రజలు సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేసినట్లు తెలిపారు.

సర్వే ప్రకారం.. భారత్ తర్వాత ఈ కింది దేశాలు ఉన్నాయి.
*అమెరికా, ఫిన్లాండ్, యూకే: 59%
*ఫ్రాన్స్: 58%
*పోలాండ్: 56%
*జర్మనీ, నెదర్లాండ్స్: 55%
*చైనా, స్వీడన్: 54%
*కెనడా: 53%
*మెక్సికో: 52%
*దక్షిణాఫ్రికా: 50%
*ఆస్ట్రియా: 48%
*బ్రెజిల్: 56%
*స్పెయిన్: 45%
*ఇటలీ: 40%
*దక్షిణ కొరియా: 36%
ఏ రకమైన వస్తువులు ఎక్కువగా అమ్ముడయ్యాయి?
ప్రపంచంలో సెకండ్ హ్యాండ్ వస్తువుల మార్కెట్‌లో ఉత్తర అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఆ తర్వాత యూరప్, ఆసియా పసిఫిక్, దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ఉన్నాయి. ఈబే వంటి అనేక ఆన్‌లైన్ కంపెనీలు సెకండ్ హ్యాండ్ వస్తువులను విక్రయిస్తున్నాయి. ఈ మార్కెట్‌లో ఎక్కువగా ఫర్నిచర్, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, క్రీడా సామాగ్రి అమ్ముడవుతున్నాయి.












Click it and Unblock the Notifications