వెండి వెలిగిపోతుంది. రూల్స్ మార్చినా సేల్స్ తగ్గేదేలే
శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్, ప్రధాన పండుగలు దగ్గరపడుతుండటంతో వెండికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. భారతీయ విపణిలో లభిస్తున్న భారీ లాభాలు, ఆకర్షణీయమైన ప్రీమియం ధరలను అందిపుచ్చుకునేందుకు దిగుమతిదారులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు, కఠినమైన లైసెన్సింగ్ విధానం పసిడి, వెండి వ్యాపారులకు పెద్ద సవాలుగా మారినప్పటికీ, ఆటంకాలను తట్టుకుని మరీ విదేశాల నుంచి వెండిని దేశంలోకి దిగుమతి చేస్తున్నారు. భారత ఫారెక్స్ నిల్వలను కాపాడుకునేందుకు మే నెలలో కేంద్రం తీసుకొచ్చిన ఆంక్షల తర్వాత దాదాపు ఆరు నెలల పాటు నిలిచిపోయిన వెండి దిగుమతులు.. ఇప్పుడు గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ (IIBX) కేంద్రంగా మళ్లీ ఊపందుకోవడం విశేషం.

'కంట్రీ ఆఫ్ ఆరిజిన్' కస్టమ్స్ మోకాలడ్డు!
అయితే ఈసారి వెండిని దేశంలోకి తీసుకురావడం అంత సులువుగా మారలేదు. కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చే ప్రతి వెండి రవాణా సరుకుకు సంబంధించి, అది ఏ దేశంలో ఉత్పత్తి అయిందో తెలిపే అధికారిక 'కంట్రీ ఆఫ్ ఆరిజిన్' ప్రభుత్వ ధృవీకరణ పత్రం తప్పనిసరి చేశారు. సాధారణంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTA) ఉన్న దేశాలకు మాత్రమే వర్తించే ఈ నిబంధనను అందరికీ వర్తింపజేయడంతో కస్టమ్స్ అధికారుల వద్ద సరుకు క్లియరెన్స్ ఆలస్యమవుతోంది. అవసరమైన పత్రాలను త్వరగా సమర్పించలేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, వేగంగా సర్టిఫికెట్లు ఇచ్చే దేశాల వైపే మొగ్గు చూపుతూ దిగుమతులను ముందుకు తీసుకెళ్తున్నారు.
పరిమితమైన సరఫరా.. రాబోయే పండుగల డిమాండ్!
ఆగస్టు నెలలోనే దాదాపు 400 టన్నుల దిగుమతులకు లైసెన్సులు మంజూరవ్వడంతో మార్కెట్లో వెండి కొరత కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో స్థానిక, అంతర్జాతీయ ధరల మధ్య వ్యత్యాసం కొంత తగ్గి అంతులేని ప్రీమియంలకు కాస్త అడ్డుకట్ట పడింది. అయినప్పటికీ, కస్టమ్స్ వద్ద జరుగుతున్న ఆలస్యం, రీఫైనింగ్ లాజిస్టిక్స్ ప్రక్రియ వల్ల సరుకు పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రావడానికి మరికొన్ని వారాల సమయం పట్టేలా ఉంది. వచ్చే రోజుల్లో పండుగల కొనుగోళ్లు ఊపందుకోనుండటంతో, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న పరిమితమైన స్టాక్‌తోనే వ్యాపారులు డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.














Click it and Unblock the Notifications