వాహనదారులకు ఊరట లభించినట్టేనా?
మధ్యప్రాచ్యంలోని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు ఇటీవల తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం వాటాను నియంత్రించే కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా రవాణాకు అంతరాయాలు కలుగుతాయనే భయాలు ఈ పరిస్థితికి కారణం అయ్యాయి.
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో గందరగోళం ఉన్నప్పటికీ, రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలను సమీప భవిష్యత్తులో స్థిరంగా ఉంచుతామని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇదివరకే వెల్లడించాయి. ఈ నిర్ణయంతో వాహనదారులకు ఊరట కలిగించింది. కేంద్ర, పలు రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించినప్పటి నుండి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 2022 మే నుంచి స్థిరంగా ఉంటోన్నాయి. ఇంధన ధరలు అంతర్జాతీయ ముడిచమురుపై ఆధారపడి ఉన్నప్పటికీ, పన్నులు, మారకపు రేట్లతో సహా అనేక నియంత్రణ, ఆర్థిక కారకాలు ప్రభావితం చేస్తాయి.
ప్రపంచ ముడిచమురు మార్కెట్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, భారతీయ చమురు కంపెనీలు సామాన్య వినియోగదారులపై అదనపు భారాన్ని మోపట్లేదు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు సహా ఇతర నగరాల్లో నేటి ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు లేదు. సాధారణ పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇదివరకే పారిశ్రామిక డీజిల్ ధరను 25 శాతం మేర పెంచాయి.

నేడు వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52












Click it and Unblock the Notifications