మన రూపాయి బ్రహ్మాండం.. యుద్ధం జరుగుతున్నా నిలబడింది
అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో కొంచం బలపడింది. యుద్ధ పరిస్థితులు ముదురుతున్న వేళ వారాంతంలో ఊహించని మార్పు డాలర్ లో కనిపించిది. శుక్రవారం ఉదయం 95.27 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్.. ప్రారంభంలో కొంత బలహీనపడింది 95.22 వద్దకు చేసింది. అనంతరం 95.42కి దూసుకుపోయింది. చివరికి 95.33 (ప్రోవిజనల్) వద్ద సెటిల్ అయింది. ఇది నిన్నటి రోజు క్లోజ్‌తో పోలిస్తే 14 పైసలు లాభం.
డాలర్ విలువ బలహీనపడటం, క్రూడ్ ఆయిల్ ధరల్లో తగ్గుదల కారణంగా రూపాయి గెయిన్ చేసినట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. అయితే, విదేశీ పెట్టుబడల ఔట్‌ఫ్లోలు, పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు.. డాలరపై ఒత్తిడి తెచ్చాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఉన్న సానుకూల వాతావరణం మాత్రం రూపాయికి మద్దతుగా నిలిచింది.

అమెరికా ఇరాన్‌పై తాజా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించడం, ఇరాన్ తిరిగి దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాలు సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మార్కెట్ హైలెట్స్ ఈ రోజు ఇలా ఉన్నాయి.
- డాలర్ ఇండెక్స్ 100.86 వద్ద 0.04 శాతం తగ్గుదలతో ట్రేడ్ అవుతోంది.
- బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 75.83 డాలర్ల వద్ద 0.62 శాతం తగ్గింది.
- దేశీయ మార్కెట్లలో సెన్సెక్స్ 827.57 పాయింట్లు (1.08%) పెరిగి 77,569.39 వద్ద, నిఫ్టీ 244.10 పాయింట్లు (1.02%) లాభంతో 24,206.90 వద్ద క్లోజ్ అయ్యాయి.
- గురువారం ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నికరంగా రూ.532.86 కోట్ల విలువైన షేర్లను అమ్మకం జరిగింది.














Click it and Unblock the Notifications