అమాంతం కుప్పకూలిన రూపాయి- మరో మహా పతనం

పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలు భారత్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. రూపాయి విలువ పతనానికి దారి తీస్తోన్నాయి. ఇరాన్ యుద్ధానికి ముందు నుంచీ భారీగా పతనమౌతూ వస్తోంది రూపాయి. ఈ యుద్ధం దీనికి మరింత ఆజ్యం పోసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యప్రాచ్య యుద్ధ ఆందోళనల మధ్య రూపాయి 96 మార్కును దాటింది. 96.38 పైసలకు చేరింది. సోమవారం 96.17 పైసలకు పడిపోగా.. 24 గంటల్లోనే ఈ కనిష్టాన్ని అధిగమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి, భారత కరెన్సీ సుమారు 5.1 శాతం మేర బలహీనపడింది. యుద్ధ ప్రభావం దేశీయ కరెన్సీ మీద ఏ స్థాయిలో పడిందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, సహజవాయువు ఇంధన సరఫరాలో తలెత్తిన సంక్షోభం కొనసాగుతోండటం, అంతర్జాతీయంగా డాలర్ బలపడటం వంటి పరిణామాలు రూపాయి పతనానికి ప్రధాన కారణం అయ్యాయి. మధ్యప్రాచ్య సంఘర్షణ చమురు సరఫరా అంతరాయాలు దీర్ఘకాలం కొనసాగవచ్చనే భయాలను రేకెత్తించింది.

Indian Rupee hits All Time Low as 96 38 per dollar with an 18-paise fall driven by weakness in Asia

ఇంటర్‌బ్యాంక్ ఎక్స్ఛేంజ్ లో రూపాయి విలువ ఈ ఉదయం రూ. 96.19 పైసల వద్ద ప్రారంభమై ఆ వెంటనే 96.38 పైసలకు పడిపోయింది. సోమవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 18 పైసలు నష్టం. సోమవారం రూపాయి విలువ డాలర్‌కు 96.17 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. దీని ప్రభావం కరెన్సీలనే కాకుండా గ్లోబల్ ఈక్విటీలు, బాండ్ మార్కెట్లపై కూడా పడింది. స్టాక్ మార్కెట్లు ఒత్తిడిని చూడగా, బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై పెట్టుబడిదారుల ఆందోళనకు ఇది అద్దం పట్టింది.

అంతర్జాతీయ పరిణామాలు, నిరంతర విదేశీ నిధుల ప్రవాహాలు రూపాయిపై ఒత్తిడిని కొనసాగించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే బ్యాంకులకు విదేశీ మారకపు స్థానాలపై పరిమితులను కఠినతరం చేసింది. ప్రతి పని దినం ముగిసేలోపు నికర ఓపెన్ రూపాయి స్థానాలను 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేయాలని ఆదేశించింది గానీ అవేవీ కార్యరూపం దాల్చట్లేదు. ఈ ఆదేశాల నేపథ్యంలో బ్యాంకులు తమ ఆర్బిట్రేజ్ లావాదేవీలను నిలిపివేసి, దేశీయ మార్కెట్‌లో డాలర్లను విక్రయించే అవకాశం ఉంది.

అయినప్పటికీ- రూపాయం పతనానికి బ్రేకులు పడట్లేదు. ఆర్‌బీఐ చర్యలు స్వల్పకాలిక ఊరటను మాత్రమే ఇచ్చాయనేది తాజా పతనంతో స్పష్టమౌతోంది. కొద్ది రోజుల కిందటే 95 రూపాయల మార్క్ ను దాటింది రూపాయి విలువ.. అతి తక్కువ సమయంలోనే 96 రూపాయలను దాటడం అత్యంత ఆందోళనకరం. అంతర్జాతీయ లావాదేవీలన్నీ కూడా డాలర్ మీదే ఆధార పడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ ఈ స్థాయికి పతనం కావడం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తడిలోకి నెట్టినట్టవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+