ఒక డాలర్ కు రూ. 91 దాటేసింది: సెంచరీకి పెద్దగా టైమ్ పట్టదు బాస్..!!

రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతంగా రికార్డు స్థాయిలో క్షీణించింది. ఒక డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ ఏకంగా 91 రూపాయలను దాటేసింది. ఒక దశలో గరిష్టంగా 91.07 పైసలకు చేరింది. కొద్ది రోజుల కిందటే 90 రూపాయల మార్క్ ను దాటింది రూపాయి విలువ. అతి తక్కువ సమయంలోనే 91 రూపాయలను కూడా దాటడం అనేది అత్యంత ఆందోళనకరం.

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ లావాదేవీలన్నీ కూడా డాలర్ మీదే ఆధార పడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ 90ని దాటడం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తడిలోకి నెట్టినట్టవుతుంది. ఇది రికార్డు స్థాయి పతనం. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్‌లో రూపాయి విలువ దిగజారిపోలేదు. రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడంతో అటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదు.

Indian Rupee Hitting New Record Low Against the Dollar To Rs 91

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 87 రూపాయల వరకు కనిపించిన రూపాయి విలువ మూడో త్రైమాసికం చివరి నాటికి 90 రూపాయలను దాటిందంటే దాని పతనం ఎంత వేగంగా కొనసాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.సోమవారం నాటితో పోల్చుకుంటే ఒకేసారి .30 శాతం అంటే 30 పైసల మేర క్షీణించడం అనేది మింగుడుపడట్లేదు. అటు స్టాక్ మార్కెట్ పై కూడా దీని దుష్ప్రభావం పడింది. సెన్సెక్స్ భారీగా నష్టపోతోంది. బోంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నష్టాలతో ఆరంభం అయ్యాయి.

వ్యాపారాలపై అధిక వ్యయ భారం పడినట్టయింది. దిగుమతుల ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. దేశీయ మార్కెట్ల నుండి అంతర్జాతీయ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ, అలాగే ఇతర ప్రధాన కరెన్సీల ముందు డాలర్ బలోపేతం కావడం వంటివి ఈ క్షీణతకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. రూపాయి విలువ పడిపోవడం ఊహించినప్పటికీ- దాని వేగం మార్కెట్‌ను ఆశ్చర్యపరుస్తోంది.

ఈ అస్థిరతను తగ్గించడానికి నివారణ చర్యలను తీసుకుంటామని ఆర్బీఐ చెబుతూ వస్తోంది గానీ దాని ఫలితం జీరో అనడానికి ఇదే తాజా ఉదాహరణ. బలహీనమైన విదేశీ పోర్ట్‌ఫోలియోలు, పెండింగ్‌లో ఉన్న అమెరికా- భారత్ ట్రేడ్ అగ్రిమెంట్స్, అందులో కొనసాగుతున్న అనిశ్చితి వంటివి రూపాయి పతనానికి దారి తీశాయి. రూపాయి విలువ క్షీణించిన ప్రభావం వ్యాపారాలపై నేరుగా పడుతుంది. ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక వస్తువుల దిగుమతుల భారం ఖజానాపై పడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+