అలా మొదలైన రూపాయి ప్రయాణం.. నేటి ట్రేడింగ్ రేంజ్ ఇదే!
అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నప్పటికీ భారత కరెన్సీ రూపాయి బుధవారం ఉదయం స్వల్ప పుంజుకుంది. ఆసియా వ్యాప్తంగా ఇతర దేశాల కరెన్సీలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న తరుణంలో, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు పుంజుకుని ట్రేడింగ్‌ను సానుకూలంగా ప్రారంభించింది.
సోమవారం నాటి ట్రేడింగ్ ముగింపు సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.12 వద్ద ఉండగా, బుధవారం ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే 9 పైసలు లాభపడి 95.03 స్థాయికి చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాబోయే కాలంలో వడ్డీ రేట్ల పెంపుపై తీసుకోబోయే నిర్ణయాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో మన రూపాయి సానుకూల ధోరణి కనబరచడం విశేషం.

విదేశీ మార్కెట్లలో క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు కరెన్సీ ట్రేడింగ్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఒకానొక దశలో బ్యారెల్ ముడిచమురు ధర 113.32 డాలర్లకు దిగివచ్చినప్పటికీ, సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులు , అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా మళ్లీ 115.90 డాలర్లకు ఎగబాకింది. విదేశీ మారక నిపుణుల అంచనా ప్రకారం.. ఇవాళ్టి ట్రేడింగ్‌లో రూపాయి విలువ 95.00 నుంచి 95.25 శ్రేణి మధ్యలోనే కొనసాగే అవకాశముంది. దిగుమతిదారులు రూపాయి తగ్గినప్పుడు కొనుగోళ్లు జరపగా, ఎగుమతిదారులు లభించే అవకాశాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
అంతర్జాతీయంగా ఆసియా ఖండంలోని వివిధ దేశాల కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే భిన్నమైన ధోరణిని ప్రదర్శించాయి. దక్షిణ కొరియా 'వాన్' అత్యధికంగా 0.369 శాతం నష్టపోగా, ఇండోనేషియా 'రూపియా', థాయిలాండ్ 'బాట్', సింగపూర్ 'డాలర్'లు కూడా కొంతమేర బలహీనపడ్డాయి. మరోవైపు, తైవాన్ 'డాలర్' 0.222 శాతం, ఫిలిప్పీన్స్ 'పెసో' 0.101 శాతం మేర లాభపడ్డాయి. మలేషియా 'రింగ్గిట్', జపాన్ 'యెన్', చైనా 'యువాన్'లు కూడా స్వల్ప లాభాలతో గడిపాయి.














Click it and Unblock the Notifications
