Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేపిటల్ గెయిన్స్ టాక్స్ ఎఫెక్ట్ ఇలా.. రూ.4.6 లక్షల కోట్ల మదుపర్ల పెట్టుబడి ఆవిరి

ముంబై: దాదాపు 14 ఏళ్ల తర్వాత కాపిటల్ గెయిన్స్ టాక్స్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చడం మదుపర్ల ఆశలు ఆవిరయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే దలాల్‌స్ట్రీట్‌లో నష్టాలు ఏరులై పారడంతో మదుపరుల సంపద రూ. 4.6 లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది. ఎల్‌టీసీజీ పన్ను భయాల నడుమ తీవ్రస్థాయిలో అమ్మకాల ఒత్తిడి నెలకొనగా, బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ)లోని సంస్థల మార్కెట్ విలువ రూ.4.6 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో మదుపరుల సంపద రూ.153.1 లక్షల కోట్ల నుంచి రూ.148.4 లక్షల కోట్లకు పడిపోయింది. మొత్తం లిస్టింగ్ షేర్లలో 2,500లకుపైగా షేర్లు నష్టాలకే పరిమితమయ్యాయి. అవును మరి. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ పరిచయమైన దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్ను స్టాక్ మార్కెట్ల ఉసురు తీసింది. ఎల్‌టీసీజీ పన్ను పోటుకు శుక్రవారం ఈక్విటీ మార్కెట్లు విలవిల్లాడిపోయాయి మరి.

 గురువారం బడ్జెట్ ప్రతిపాదనల్లో చెప్పగానే ఉలిక్కిపడ్డ సూచీలు

గురువారం బడ్జెట్ ప్రతిపాదనల్లో చెప్పగానే ఉలిక్కిపడ్డ సూచీలు

ఫలానా రంగం.. అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో పెట్టిన పెట్టుబడులను వెనుకకు తీసుకోవడమే పనిగా పెట్టుకున్నారు మదుపరులు. ఉదయం ట్రేడింగ్ మొదలైందే ఆలస్యం.. షేర్ల అమ్మకాలే పరమావధిగా కనిపించారు. దీంతో అంతకంతకూ క్షీణించిన సూచీలు.. చివరకు భీకర నష్టాల్నే మూటగట్టుకున్నాయి. నిజానికి గురువారం బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి జైట్లీ నుంచి కేపిటల్ గెయిన్స్ టాక్స్ ప్రకటన వచ్చీరాగనే సూచీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కానీ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడిని తాత్కాలిక పరిణామంగా అభివర్ణించారు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్. మదుపరులలో తలెత్తిన భయాలు ఎంతోకాలం ఉండవన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఎల్‌టీసీజీ పన్ను నేపథ్యంలో సెన్సెక్స్ 840, నిఫ్టీ 256 పాయింట్లు పడిపోవడంపై గార్గ్ స్పందించారు. నిజానికి మదుపరుల నుంచి ఈ తరహా స్పందన వస్తుందని ముందే ఊహించామని చెప్పారు. ఇదంతా స్వల్పకాలిక ప్రభావమేనని పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నదని, వృద్ధిరేటు పుంజుకుంటున్నదన్న ఆయన ఎటువంటి భయాందోళనలు అక్కర్లేదని మదుపరులకు భరోసా ఇచ్చారు.

 ఆరోగ్య బీమా మోయలేని భారం అని ఆందోళనలు

ఆరోగ్య బీమా మోయలేని భారం అని ఆందోళనలు

అయితే మదుపర్లకు గురువారం నిద్రలేని రాత్రి మిగిల్చిందనడానికి శుక్రవారం మార్కెట్‌ భారీ నష్టాలే అందుకు నిదర్శనం. వాళ్లు ఎంతలా భయపడి తెగనమ్ముకున్నారో అర్థమవుతోంది. బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇదొక్కటే కాదు మరిన్ని ప్రతికూలతలూ ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. పది కోట్ల పేద కుటుంబాలకు ఆలంబనగా ప్రకటించిన జాతీయ ఆరోగ్య రక్షణ పథకం ఆశయం మంచిదే కానీ.. అంత భారీ పథకానికి ప్రభుత్వం నిధులు ఎక్కడి నుంచి తెస్తుందన్నది అసలు ప్రశ్న. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా-మెరిల్‌ లించ్‌ (బీఓఏ-ఎమ్‌ఎల్‌) నివేదిక ప్రకారం.. 5 శాతం మంది లబ్దిదారులు సగం మొత్తానికి క్లెయిం చేసుకున్నా.. 20 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.1,30,000 కోట్లు)కు చేరుతుంది. ఇది ఎంత భారీ మొత్తమో తెలిసిందే కదా అంటోంది.

ఆదాయ వసూళ్ల విషయంలోనూ సవాళ్లు

ఆదాయ వసూళ్ల విషయంలోనూ సవాళ్లు

జీఎస్‌టీ, ఆదాయ వసూళ్ల విషయంలోనూ సవాళ్లు ఉన్నాయి. ఇవి జీడీపీలో రెండు శాతమే. వచ్చే ఏడాది ఇవి 4 శాతానికి చేరతాయని అంచనా. జీఎస్‌టీ అమలు విషయంలో ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఆదాయ వసూళ్లు స్థిరంగా ముందుకు వెళ్లడం లేదు. అయితే కొంత కాలానికి ఇది స్థిమితమవుతుందనే అంచనాలున్నాయి. ఆహార, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై మొత్తం సబ్సిడీని 15 శాతం పెంచి రూ.2.64 లక్షల కోట్లకు పెంచినా అందులో ఇంధన సబ్సిడీని 2017-18 స్థాయిలోనే ఉంచారు. మూడు నెలల్లో బ్రెంట్‌ ముడి చమురు బారెల్‌ ధర 75 డాలర్లకు; ఆరు నెలల్లో 82.50 డాలర్లకు చేరుతుందన్న గోల్డ్‌మాన్‌ శాక్స్‌ అంచనాల ప్రకారమే అదనంగా రూ.25,000-30,000 కోట్ల భారం పడుతుంది.

ద్రవ్యోల్బణం పెరుగుతుందని కార్పొరేట్ వర్గాల ఆందోళన

ద్రవ్యోల్బణం పెరుగుతుందని కార్పొరేట్ వర్గాల ఆందోళన

పరోక్ష పన్నులు 19.1 శాతం మేర పెరుగుతాయని బడ్జెట్‌ చెప్పడం కొంత అతిశయోక్తిగా ఉందని బ్రోకరేజీ సంస్థలు అంటున్నాయి. అలాగే స్థూల పన్నులు కూడా జీడీపీలో 12 శాతానికి మించి పెరుగుతాయని చెప్పడం అలాంటిదేనంటున్నారు. ఇక కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ) పెంచిన నేపథ్యంలో అది ద్రవ్యోల్బణంపై ప్రభావాన్ని చూపుతుంది. ద్రవ్యోల్బణం ఆధారంగా అడుగులు వేస్తున్న ఆర్‌బీఐ వచ్చే పరపతి విధాన సమీక్షలో కచ్చితంగా కఠిన వైఖరే అవలంబిస్తుంది. ఇది తక్కువ వడ్డీ రేట్ల కోసం ఎదురుచూస్తున్న పరిశ్రమలకు నిరాశ కలిగించే పరిణామమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అందుకే బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన నరేంద్రమోదీ ప్రభుత్వం స్టాక్ మార్కెట్ అవిశ్వాసం ప్రకటించాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+