ఎల్లుండి బంగారం ధరల్లో భారీ ట్విస్ట్? సెప్టెంబర్ నెలలో పసిడి పరిస్థితి ఇదేనా..

నింగినంటిన పసిడి ధరలతో ఆందోళన చెందుతున్న పసిడి ప్రియులు, ఇన్వెస్టర్లకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కీలక సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల తులం బంగారం ధర రూ. 1.60 లక్షల మార్కును దాటి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, వారాంతంలో ఊహించని విధంగా ధరలు భారీగా పతనమయ్యాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో అక్టోబర్ కాంట్రాక్ట్ బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే 1.63 శాతం తగ్గి రూ. 1,56,400 వద్ద స్థిరపడింది. వచ్చే సోమవారం మార్కెట్ ప్రారంభంలో కూడా పసిడి రేట్లు మరింత తగ్గేలా లేదా ఫ్లాట్‌గా నమోదయ్యే అవకాశం ఉందని కమోడిటీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ చేసిన వ్యాఖ్యలే ఈ పతనానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడ్ వడ్డీ రేట్లను అనుకున్నంత వేగంగా తగ్గించకపోవచ్చనే సంకేతాలు ఇవ్వడంతో ఇన్వెస్టర్లు భారీగా ప్రాఫిట్ బుకింగ్ దిగారు. వడ్డీ రేట్ల తగ్గింపుపై అనిశ్చితి నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర ఒక్కసారిగా 4,678 డాలర్ల నుంచి 4,512 డాలర్లకు పడిపోయింది. గత కొన్ని వారాలుగా సాగిన ఊహించని ర్యాలీకి ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి.

Is Gold Investment Safe in 2026 Ultimate Guide to Maximizing Profits amp amp Portfolio Returns
దిగొచ్చిన బంగారం ధరలు! మూడు రోజుల తర్వాత యూ టర్న్
దిగొచ్చిన బంగారం ధరలు! మూడు రోజుల తర్వాత యూ టర్న్

సోమవారం మార్కెట్ ఎలా ఉండబోతోంది?

రాబోయే సోమవారం బంగారం మార్కెట్ భారీ లాభాలతో (గ్యాప్-అప్) ప్రారంభమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ఎంత తగ్గినా, మన దేశంలో రూపాయి మారకం విలువ క్షీణించడం భారత మార్కెట్‌కు కొంత ఊరటనిస్తుందని భావిస్తున్నారు. రూపాయి బలహీనపడితే ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు మరీ దారుణంగా పడిపోకుండా కొంతవరకు పతనానికి అడ్డుకట్ట పడుతుంది. వారాంతంలో జరిగే అంతర్జాతీయ పరిణామాలు కూడా సోమవారం నాటి ప్రారంభ రేట్లను ప్రభావితం చేయనున్నాయి.

పా<strong>తాళానికి పసిడి రేట్లు- మరో భారీ పతనం</strong>
పాతాళానికి పసిడి రేట్లు- మరో భారీ పతనం

సెప్టెంబర్ నెలలో పసిడి రేట్ల పరిస్థితి ఏంటి?

సెప్టెంబర్ నెలలో రాబోయే అమెరికా ఉద్యోగాల గణాంకాలు, నిరుద్యోగిత డేటా ఆధారంగా పసిడి తదుపరి దిశ నిర్ణయమవుతుంది. టెక్నికల్ విశ్లేషణ ప్రకారం.. పసిడి చార్ట్లలో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం MCX మార్కెట్లో 10 గ్రాములు బంగారానికి రూ. 1,53,500 వద్ద బలమైన సపోర్ట్ ఉండగా, రూ. 1,61,000 వద్ద రెసిస్టెన్స్ నెలకొంది. ధరలు రూ. 1.61 లక్షల దిగువన ఉన్నంత కాలం బంగారం మార్కెట్ స్వల్పకాలంలో క్షీణించే దిశగానే పయనించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+