చెక్.. జియో అలాట్‌మెంట్ స్టేటస్

రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ సంస్థ జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ షేర్ల కేటాయింపు ప్రక్రియ ఈ సాయంత్రానికి పూర్తికానుంది. అలాట్‌మెంట్ ఖరారవుతోండడంతో.. ఈ పబ్లిక్ ఆఫర్‌కు దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది ఇన్వెస్టర్లు తమకు షేర్లు దక్కాయో లేదో తెలుసుకోవడానికి ఎదురు చూస్తోన్నారు. దేశీయ ప్రైమరీ మార్కెట్లో వచ్చిన ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. మూడు రోజుల సబ్‌స్క్రిప్షన్ వ్యవధిలో జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ మొత్తం 22.19 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

పబ్లిక్ ఇష్యూ, యాంకర్ ఇన్వెస్టర్ల రౌండ్ల నుంచి కలిపి ఏకంగా రూ. 7.4 లక్షల కోట్లకు పైగా విలువైన బిడ్లు దాఖలయ్యాయి. ఈ ఐపీఓ కోసం సుమారు 1.39 కోట్లకు పైగా దరఖాస్తులు రావడం దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఒక్క రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచే రూ. 25,867 కోట్లకు పైగా బిడ్లు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Jio Platforms IPO Allotment Status Check Shares Allotted via KFintech BSE and NSE GMP today listing

ఈ పబ్లిక్ ఇష్యూలో షేర్లు లభించని ఇన్వెస్టర్లకు మంగళవారం రీఫండ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాట్మెంట్ దక్కిన వారి డీమ్యాట్ అకౌంట్లల్లోకి అదే రోజుల షేర్లు జమ అవుతాయి. 28న జియో ప్లాట్‌ఫార్మ్స్ షేర్లు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లల్లో లిస్ట్ కానున్నాయి. అలాట్మెంట్ నాడు కూడా గ్రే మార్కెట్ లో జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ ట్రెండ్ పాజిటివ్ గా కనిపిస్తోంది. ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం రూ.247 వద్ద ట్రేడ్ అవుతోంది.

జియో తుఫాన్.. : కోటికి పైగా బిడ్డింగ్స్: చరిత్రలో మొదటిసారి
జియో తుఫాన్.. : కోటికి పైగా బిడ్డింగ్స్: చరిత్రలో మొదటిసారి

అంటే ఇష్యూ అప్పర్ ప్రైస్ రూ.1,119తో పోలిస్తే.. ఇప్పుడున్న జీఎంపీ ప్రకారం ఈ షేరు దాదాపు రూ.1,366 వద్ద స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 22.07 శాతం వరకు లిస్టింగ్ గెయిన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి.. ఇన్వెస్టర్లకు. ఈ ఐపీఓ అధికారిక రిజిస్ట్రార్ కెఫిన్ టెక్నాలజీస్ (KFin Technologies). ఈ సంస్థకు చెందిన వెబ్‌సైట్ ద్వారా ఇన్వెస్టర్లు తమ అల్యాట్‌మెంట్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా రూ. 4.9కు వన్ జీబీ డేటా: ఆకాష్ అంబానీ
6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా రూ. 4.9కు వన్ జీబీ డేటా: ఆకాష్ అంబానీ

పోర్టల్‌ను సందర్శించిన తర్వాత 'Select IPO' విభాగానికి వెళ్లి జియో ప్లాట్‌ఫార్మ్స్ పేరును ఎంచుకోవాలి. ఆ తర్వాత పాన్ కార్డ్ నంబర్, డీమాట్ అకౌంట్ ఐడీ, అప్లికేషన్ నంబర్‌లలో ఏదో ఒక దాని వివరా ఇవ్వాలి. క్యాప్చా ఎంటర్ చేయడం ద్వారా షేర్ల కేటాయింపు స్థితిని తెలుసుకోవచ్చు. కెఫిన్ టెక్నాలజీస్‌తో పాటు బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ వెబ్‌సైట్ల ద్వారా కూడా అల్యాట్‌మెంట్ వివరాలు అందుబాటులో ఉంటాయి. బీఎస్ఈ వెబ్‌సైట్‌లో ఈక్విటీ' విభాగాన్ని ఎంచుకుని, కంపెనీ పేరు, పాన్ నంబర్ నమోదు చేయడం ద్వారా స్టేటస్ చూడవచ్చు. ఎన్‌ఎస్ఈ పోర్టల్‌లో ఇన్వెస్టర్లు సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+