బంపర్ లిస్టింగ్- లాభాలు పంచి పెట్టిన జియో

రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ సంస్థ జియో ప్లాట్‌ఫార్మ్స్ అంచనాలకు తగ్గట్టే సత్తా చాటాయి. స్టాక్ మార్కెట్ లో లాభాలతో లిస్టింగ్ అయ్యాయి. ఈ ఉదయం 21 శాతానికి పైగా లాభాలతో బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లల్లో లిస్ట్ అయ్యాయి. గ్రే మార్కెట్ ప్రీమియం అంచనాలకు తగ్గట్టే ఒక్కో షేర్ పై 239 రూపాయల అదనపు మొత్తాన్ని పంచిపెట్టాయి. ట్రేడింగ్ ఆరంభమైన తర్వాత కూడా నిలకడగా కొనసాగాయి. ఒకవంక సెన్సెక్స్ భారీగా పడిపోతోన్నప్పటికీ.. జియో ప్లాట్‌ఫార్మ్స్ షేర్లు స్థిరంగా కనిపించాయి.

జీఎంపీ అంచనాల ప్రకారం.. జియో ప్లాట్ ఫామ్స్ షేర్లు స్టాక్ మార్కెట్ లో రూ.240 వద్ద లిస్ట్ కావాల్సి ఉంది. ఈ మొత్తానికి ఒక్క రూపాయి తక్కువగా అంటే.. రూ. 239 వద్ద లిస్ట్ అయ్యాయి జియో షేర్లు. ఒక్కో షేర్ అప్పర్ ప్రైస్ రూ.1,119. కాగా.. దీనికి 239 రూపాయలు అదనంగా అంటే రూ.1,358 వద్ద స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. దాదాపు 21.37 శాతం వరకు లిస్టింగ్ గెయిన్స్ లభించినట్టయింది. టెలికాం, డిజిటల్ రంగంలో తిరుగులేని ఆధిపత్యం, 53.3 కోట్లకు పైగా ఉన్న యూజర్లు, 5జీ నెట్‌వర్క్..జియో ప్లాట్ ఫామ్స్ కు ప్రధాన బలం.

Jio Platforms shares made a strong market debut listing at a premium of 21 percent Long term gains

ఒక లాట్ లో 12 షేర్లు ఉంటాయి. ఒక లాట్ కొనడానికి రూ. 13,428 లను కేటాయించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఒక లాట్ మీద 2,850 రూపాయల లాభం లభించింది.. రిటైల్ ఇన్వెస్టర్లకు. ఈ ఐపీఓలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల కోసం రూ. 2,500 కోట్లు, అర్హులైన కంపెనీ ఉద్యోగుల కోసం రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రత్యేకంగా కేటాయించింది. ఎంప్లాయిస్ కేటగిరీలో బిడ్ వేసేవారికి ప్రతి షేరుపై రూ. 54 తగ్గింపు లభించింది.

జియో తుఫాన్.. : కోటికి పైగా బిడ్డింగ్స్: చరిత్రలో మొదటిసారి
జియో తుఫాన్.. : కోటికి పైగా బిడ్డింగ్స్: చరిత్రలో మొదటిసారి

రిటైల్ ఇన్వెస్టర్లు జియో ప్లాట్ ఫామ్స్ షేర్లను దీర్ఘకాలిక లాభాల కోసం హోల్డ్ లో ఉంచవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు సూచిస్తోన్నాయి. ఈ ఐపీఓ ద్వారా వచ్చే మొత్తంతో జియో ప్లాట్‌ఫార్మ్స్ మొత్తం మార్కెట్ క్యాప్ సుమారు రూ. 10.3 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఐపీఓ ద్వారా సేకరించిన నిధుల సేకరణతో జియో యాజమాన్యం తన మూలధన మొత్తాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది. ఐపీఓ ద్వారా లభించే నిధులలో అధిక భాగాన్ని రుణాల చెల్లింపులకే ఉపయోగించనున్నారు.

6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా రూ. 4.9కు వన్ జీబీ డేటా: ఆకాష్ అంబానీ
6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా రూ. 4.9కు వన్ జీబీ డేటా: ఆకాష్ అంబానీ

మొత్తం రూ. 30,213 కోట్లలో దాదాపు 91 శాతం అంటే రూ. 27,500 కోట్లను తన ప్రధాన అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బకాయిల ప్రీపేమెంట్ లేదా రీపేమెంట్ కోసం కేటాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వెచ్చిస్తారు. దీనివల్ల కంపెనీపై వడ్డీ భారం తగ్గి లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+