Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'జాబ్ హగ్గింగ్' అంట మావా.. ఐటీ బాబుల కొత్త ప్రేమ కథ!

Job Hugging: కార్పొరేట్ ప్రపంచంలో తరచూ కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. గతంలో 'క్వైట్ క్విటింగ్', 'మున్సిపల్ మండేస్' వంటివి వార్తల్లో నిలవగా.. ఇప్పుడు 'జాబ్ హగ్గింగ్' అనే సరికొత్త పదం మారుమోగుతోంది. అసలు ఈ ట్రెండ్ ఏంటి? ఉద్యోగులు ఎందుకు ఇలా చేస్తున్నారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

జాబ్ హగ్గింగ్ అంటే ఏమిటి?
సరళంగా చెప్పాలంటే.. 'జాబ్ హగ్గింగ్' అంటే ఉద్యోగులు తమ ప్రస్తుత ఉద్యోగాన్ని గట్టిగా పట్టుకుని ఉండటం. తమ పనిలో సంతృప్తి లేకపోయినా, ఎదుగుదల లేకపోయినా, లేదా ఆ పని బోర్ కొడుతున్నా సరే.. ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడానికి వారు ఇష్టపడరు. ఒకప్పుడు ఎక్కువ జీతం కోసం తరచూ కంపెనీలు మారే 'జాబ్ హోపింగ్' ట్రెండ్ ఉండేది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా 'సెక్యూరిటీ' ముఖ్యం అని భావిస్తూ ఉన్న చోటే ఉండిపోవడాన్ని జాబ్ హగ్గింగ్ అంటున్నారు.

Job Hugging Trend Why Employees Are Holding On to Jobs Amid Economic Uncertainty Full Details

ఎందుకు ఈ ట్రెండ్ పెరుగుతోందంటే?
ఈ ట్రెండ్‌కు ప్రధానంగా ఆర్థిక అనిశ్చితి, కునారిల్లుతున్న జాబ్ మార్కెట్ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగాలేవు. కొత్త ఉద్యోగాల కల్పన తగ్గింది. 2013 తర్వాత (కరోనా కాలం మినహా) నియామకాలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వల్ల భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ఉద్యోగులు భయపడుతున్నారు. కొత్త కంపెనీకి వెళ్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి తెలిసిన చోటే ఉండటం సురక్షితమని భావిస్తున్నారు.మాన్‌స్టర్ 2025 రిపోర్ట్ ప్రకారం.. 75 శాతంమంది ఉద్యోగులు 2027 వరకు తమ ప్రస్తుత ఉద్యోగాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వీరిలో 48 శాతం మంది కేవలం భయం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

దీనివల్ల వచ్చే నష్టాలేంటి?
ఉద్యోగాన్ని కాపాడుకోవడం మంచిదే అయినా, దీర్ఘకాలంలో ఇది కొన్ని నష్టాలను కలిగిస్తుంది. వృత్తిపరమైన ఎదుగుదల నిలిచిపోవడంతో పాటు కొత్త సవాళ్లు స్వీకరించకపోతే నైపుణ్యాలు మెరుగుపడవు. నచ్చని పనిని భయంతో చేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కేవలం భయంతో పనిచేసే ఉద్యోగుల వల్ల కంపెనీల్లో సృజనాత్మకత, కొత్త ఆలోచనలు తగ్గుతాయి.

ఉద్యోగంలో ఉంటూనే ఎదగడం ఎలా?
జాబ్ హగ్గింగ్ చేస్తున్నా సరే, కెరీర్ పరంగా స్థిరంగా ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఉన్న కంపెనీలోనే కొత్త బాధ్యతలు స్వీకరించడం, వేరే డిపార్ట్‌మెంట్‌లతో కలిసి పనిచేస్తూ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం చేయాలి. దీనివల్ల రేపు మార్కెట్ పుంజుకున్నప్పుడు మీరు కొత్త అవకాశాలకు సిద్ధంగా ఉంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+